Volvo: భారత్‌పై వోల్వో ఫోకస్‌.. దేశంలో తొలిసారిగా..

18 Mar, 2022 10:46 IST|Sakshi

భారత్‌లో వోల్వో వెహికల్‌ టెక్‌ల్యాబ్‌ 

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: కార్లు, ట్రక్కుల తయారీలో ఉన్న స్వీడన్‌ సంస్థ వోల్వో గ్రూప్‌ భారత్‌లో పరిశోధన, అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ) కార్యకలాపాలను విస్తరించనున్నట్టు ప్రకటించింది. ఇందులో భాగంగా వెహికల్‌ టెక్‌ల్యాబ్‌ ఏర్పాటుకు శంఖుస్థాపన చేసింది. ల్యాబ్‌లో వర్చువల్‌ రియాలిటీ, హ్యూమన్‌ బాడీ మోషన్‌ ట్రాకింగ్‌ ఆధారిత సిమ్యులేటెడ్‌ వర్క్‌షాప్‌ ఏర్పాటు చేస్తారు. అంతర్జాతీయంగా ఉన్న వోల్వో ఇంజనీర్లు ఈ వేదికపైకి వచ్చి వాహనాల అభివృద్ధిలో వర్చువల్‌గా పాలుపంచుకుంటారు. వాహనాల అభివృద్ది సమయం గణనీయంగా తగ్గుతుందని కంపెనీ తెలిపింది.

దేశీయ వాహన తయారీ రంగంలో ఇటువంటి ల్యాబ్‌ స్థాపించడం ఇదే తొలిసారి. బెంగళూరులో సంస్థకు ఆర్‌అండ్‌డీ కేంద్రం ఉంది. స్వీడన్‌ వెలుపల అతిపెద్ద పరిశోధన, అభివృద్ధి కేంద్రంగా భారత్‌ అవతరించిందని వోల్వో తెలిపింది. 2024 నాటికి కర్బన ఉద్గారాలను సున్నా స్థాయికి తీసుకురావడం లక్ష్యమని వెల్లడించింది. ఆటోమేషన్, ఎలక్ట్రోమొబిలిటీ, కనెక్టివిటీ విభాగాల్లో అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలను, కొత్త వ్యాపార నమూనాలను అవలంబించే పనిలో ఉన్నట్టు వివరించింది.
 

మరిన్ని వార్తలు