మనకు ఎడాదికొక ఎలక్ట్రిక్‌ కారు.. వోల్వో ప్రామిస్‌!

15 Feb, 2023 07:53 IST|Sakshi

న్యూఢిల్లీ: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న వోల్వో కార్స్‌ భారత్‌లో ఏటా ఒక ఎలక్ట్రిక్‌ కారును ప్రవేశపెట్టనున్నట్టు ప్రకటించింది. భారత్‌లో 2025 నాటికి పూర్తి ఎలక్ట్రిక్‌ కార్ల కంపెనీగా అవతరించనున్నట్టు వెల్లడించింది. అంతర్జాతీయంగా ఈ లక్ష్యాన్ని 2030 నాటికి చేరుకోనున్నట్టు తెలిపింది. వోల్వో ఇండియా సి–40 బీఈవీ ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీని 2023 అక్టోబర్‌–డిసెంబర్‌లో విడుదల చేస్తోంది. 

తమ కంపెనీకి మూడేళ్లలో అంతర్జాతీయంగా సగం మోడళ్లు ఈవీలు ఉంటాయని వోల్వో కార్స్‌ కమర్షియల్‌ ఆపరేషన్స్‌ హెడ్‌ నిక్‌ కానర్‌ తెలిపారు. సి–40 బీఈవీ మోడల్‌కు ఇతర మార్కెట్లలో అధిక డిమాండ్‌ ఉందన్నారు. భారత్‌లోనూ అటువంటి డిమాండ్‌ను ఆశిస్తున్నట్టు చెప్పారు. 2022లో కంపెనీ దేశంలో అన్ని మోడళ్లు కలిపి 1,800 యూనిట్లు విక్రయించింది. 2018లో నమోదైన 2,600 యూనిట్లను మించి ఈ ఏడాది అమ్మకాలు ఉంటాయని భావిస్తోంది.

(ఇదీ చదవండి: జోరు మీదున్న ఫోన్‌పే... రూ.828 కోట్లు!)

మరిన్ని వార్తలు