వాట్సాప్‌లో వినూత్నంగా దీపావళి శుభాకాంక్షలు చెప్పండిలా!

3 Nov, 2021 19:28 IST|Sakshi

దీపావళి పండుగ వచ్చిందంటేనే మన అందరిలో ఒక రకమైన ఉత్సాహం కనిపిస్తుంది. దీపావళి అంటేనే మన జీవితాల్లో వెలుగులు నింపే పండుగ. ఈ దీపావళి రోజున మన సంతోషాన్ని స్నేహితులు, కుటుంబసభ్యులతో శుభాకాంక్షలు తెలపడం ద్వారా పంచుకోవాలని భావిస్తూ ఉంటాం. మరి ఎప్పటిలాగానే దీపావళి శుభాకాంక్షలు టైపు చేసి తెలిపితే కిక్ ఏముంటుంది? అందుకే వాట్సాప్‌లో వినూత్నంగా స్టిక్కర్ల ద్వారా శుభాకాంక్షలు తెలపండి. వినియోగదారుల కోసం వాట్సాప్ కొత్తగా 'హ్యాపీ దీపావళి' స్టిక్కర్ ప్యాక్ ప్రవేశపెట్టింది. ఈ స్టిక్కర్ మీ మిత్రులకు, బందువులకు శుభాకాంక్షలు తెలపండి. ఎలా 'హ్యాపీ దీపావళి' స్టిక్కర్ పంపించాలని ఆలోచిస్తున్నారా?. ఈ కింద చెప్పిన విధంగా చేయండి.

దీపావళి శుభాకాంక్షలు చెప్పండిలా!

  • మొదట ఎవరికి మెసేజ్ చేయాలనుకుంటున్నారో వాళ్ల చాట్ ఓపెన్ చేసి కీబోర్డ్ ఓపెన్ చేయండి.
  • ఇప్పుడు చాట్ బార్ లోని స్మైలీ ఐకాన్ మీద క్లిక్ చేయండి.
  • ఎమోజీ బోర్డు దిగువ నుంచి స్టిక్కర్ ఐకాన్ ఎంచుకోండి. 
  • తర్వాత 'ప్లస్' ఐకాన్ మీద నొక్కండి. 
  • హ్యాపీ దీపావళి స్టిక్కర్ ప్యాక్ కోసం సర్చ్ చేయండి. 
  • మీకు కనబడకపోతే ఈ లింకు ద్వారా హ్యాపీ దీపావళి స్టిక్కర్ ప్యాక్ డౌన్ లోడ్ మీద క్లిక్ చేయండి.
  • స్టిక్కర్ ప్యాక్ ఇప్పుడు మీ స్టిక్కర్ బోర్డులో చూపిస్తుంది. 
  • ఇప్పుడు మీరు మీకు నచ్చినవారికి "హ్యాపీ దీపావళి" స్టిక్కర్ పంపించవచ్చు.

(చదవండి: జోరందుకున్న హీరో ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాలు)

మరిన్ని వార్తలు