వాట్సాప్ లో అందుబాటులోకి సరికొత్త ఫీచర్

1 Mar, 2021 18:55 IST|Sakshi

మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌ను యూజర్లకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పటి వరకు వీడియోను షేర్‌ చేసేటప్పుడు దాని వాయిస్‌ను నిలిపివేసే అవకాశం ఉండేది కాదు. అభ్యంతర కరమైన వ్యాఖ్యలు, అసహ్యమైన మాటలు ఉంటే చాలామంది ఇబ్బంది పడేవారు. ఇప్పుడు ఈ కొత్త వెర్షన్‌లో మ్యూట్‌ వీడియో సౌకర్యాన్ని వాట్సాప్‌ యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని వల్ల అనవసరమైన ఆడియోను తీసేసి సంబంధిత వీడియోను మాత్రమే పంపుకునే అవకాశం ఉంటుంది.

ఈ ఫీచర్ ను చాలా సులువుగా ఉపయోగించవచ్చు. మీరు స్టేటస్ లో షేర్ చేయాలనీ అనుకున్న వీడియోను ఎంచుకొన్నపుడు దానికింద సౌండ్ సింబల్‌ కనిపిస్తుంది. దానిని సింపుల్‌గా మ్యూట్‌ చేసేస్తే రిసీవ్‌ చేసుకునే వారికి ఎలాంటి ఆడియో లేకుండా వీడియో వెళ్లిపోతుంది. ఇప్పటికే కొంతమంది వాట్సాప్‌ యూజర్లకు అప్‌డేషన్ కూడా వచ్చేసింది. మీకు కనుక ఈ ఫీచర్ రాకపోతే ఒకసారి మీ వాట్సాప్ అప్డేట్ చేసుకోండి. అలాగే కొత్తగా తీసుకురానున్న ప్రైవసీ పాలసీపై కూడా వాట్సాప్ బృందం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.

చదవండి:

వన్‌ప్లస్ నార్డ్ కు ఆండ్రాయిడ్ 11 అప్డేట్

ఏప్రిల్ 1 నుంచి కొత్త పీఎఫ్ రూల్స్!

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు