చిన్న ఫోటో ఖరీదు రూ.1.3 కోట్లు!

6 Jul, 2021 20:58 IST|Sakshi

ఆండీ ముర్రే 2013లో వింబుల్డన్ గెలిచిన క్షణానికి సంబంధించిన ఫోటోను నాన్-ఫంగిబుల్ టోకెన్(ఎన్‌ఎఫ్‌టీ)గా సోమవారం వేలంలో $177,777(సుమారు రూ. 1.3 కోట్లు)కు విక్రయించారు. స్కాటిష్ టెన్నిస్ స్టార్ గత నెలలో తన వింబుల్డన్ విజయానికి గుర్తుగా దిగిన ఈ ఫోటోను బ్లాక్ చైన్ ఆధారిత ఎన్‌ఎఫ్‌టీ రూపంలో వీన్యూ అనే వేదికపై అమ్మకానికి ఉంచినట్లు ప్రకటించారు. ఎన్ఎఫ్ టి అనేది క్రిప్టోకరెన్సీ లాగా ఒక రకమైన డిజిటల్‌ ఆస్తి. కొనుగోలుదారుడు మాత్రమే ఆ ఎన్‌ఎఫ్‌టీపై యాజమాన్య హక్కును పొందగలడు. ఆండీ ముర్రే 2013లో గెలిచిన వింబుల్డన్ "క్షణాన్ని" కొనుగోలుదారుడు వీడియో కాపీరైట్ ను కలిగి ఉండడు. 

కానీ దానిని చూపించడానికి ఒక చిన్న డిజిటల్ స్క్రీన్ ను పొందుతారు. అమెరికన్ డిజిటల్ ఆర్టిస్ట్ బీపుల్ మార్చిలో ఒక కళాఖండాన్ని ఎన్‌ఎఫ్‌టీ రూపంలో 69.3 మిలియన్ డాలర్లకు(సుమారు రూ. 514 కోట్లు) విక్రయించినప్పుడు తాను మొదటి సారి ఎన్‌ఎఫ్‌టీ గురించి తెలుసకున్నట్లు ముర్రే చెప్పారు. బీపుల్ అనే వ్యక్తి వెన్యూ వ్యవస్థాపకుల్లో ఒకరు. "నేను ఇంకా ఎన్‌ఎఫ్‌టీల గురించి నేర్చుకుంటున్నాను, కానీ ఇది ఒక ఉత్తేజకరమైన ప్రాంతంగా అనిపిస్తుంది. మరింత మంది అథ్లెట్లు, కంటెంట్ సృష్టికర్తలు దీనిలో పాల్గొంటారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను" అని ముర్రే ఈ-మెయిల్ ద్వారా రాయిటర్స్ కు చెప్పారు.

మరిన్ని వార్తలు