ఆ జాబ్‌ పోతేనేం, మూడు రోజుల్లో..భారీ ఆఫర్‌:  7.1 మిలియన్ల వ్యూస్‌తో మహిళ వైరల్‌ స్టోరీ

30 Jan, 2023 21:25 IST|Sakshi

న్యూఢిల్లీ: ట్విటర్‌, గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజ కంపెనీలు సహా, అనేక కంపెనీల్లో ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల తొలగింపులు కొనసాగుతూనే ఉన్నాయి ఉద్యోగాన్ని కోల్పోయిన చాలామంది తమ  మనోభావాలను సోషల్‌ మీడియా ద్వారా పంచుకున్నారు. తాజాగా ఒక మహిళ అనుభవం వైరల్‌గా మారింది. ఉద్యోగాన్ని కోల్పోయిన మూడు రోజులకే..  50 శాతం పెంపుతో జీతం, వర్క్‌ ఫ్రం హోం ఆప్షన్‌, ఇతర ప్రయోజనాలతో మరో జాబ్‌ఆఫర్‌ కొట్టేశారు.  ఈ స్టోరీ ఇపుడు ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది.

babyCourtfits అనే మహిళన తన అనుభవాన్ని ట్విటర్‌లో షేర్‌ చేశారు. మంగళవారం తొలగించారు. శుక్రవారం 50 శాతం ఎక్కువ వేతనం, WFH, ఇతర ఆఫర్లతో కొత్త జాబ్వ చ్చిందంటూ పేర్కొన్నారు. ఈ  ట్వీట్‌  7.1 మిలియన్ల వ్యూస్‌ను  5వేలక పైగా రీట్విట్లు, వందల  కామెంట్లను  సాధించింది.  

ఎపుడూ  మనపై మనకుండే విశ్వాసానికి ఇదొక రిమైంటర్‌. మనం ఎవరో, ఎలా ఉండాలో శాసించేలా ఇతరులకు అవకాశం ఇవ్వొద్దు. చాలా రోజులుగా ఆత్మన్యూనతలో గడిపిన తర్వాత ఈ మాట చెబుతున్నానన్నారు. అంతేకాదు  క్లిష్ట సమయంలో తనకు మద్దతిచ్చిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. సపోర్టివ్‌ మెసేజెస్‌ పంపిన ప్రతి ఒక్కరికీ  ధన్యవాదాలు  చెప్పారు. గతవారం చాలా కష్టంగా నడిచింది. కానీ తాను స్ట్రాంగ్ విమెన్‌ని​ అంటూ  చెప్పుకొచ్చారు. దీంతో ఆమెకు ట్విటర్‌లో అభినందనల వర్షం కురుస్తోంది.

మరిన్ని వార్తలు