రెజ్లర్ల ఆందోళన: ఐకానిక్‌ క్రికెటర్స్‌ స్పందించకపోతే ఎలా? పారిశ్రామికవేత్త ట్వీట్‌ వైరల్‌

2 Jun, 2023 18:22 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్న భారతీయ మహిళా రెజ్లర్ల ఆందోళనపై ప్రముఖ పారిశశ్రామికవేత్త హర్షగోయెంకా స్పందించారు. మహిళలకు  తోటి మహిళలే అండగా లేకపోతే ఎలా? ఇంకెవరుంటారు అంటూ ట్విటర్‌ ద్వారా ప్రశ్నించారు. అంతేకాదు ప్రస్తుత దిగ్గజ క్రికెటర్లు  తోటి క్రీడాకారులకు  మద్దతు ఇవ్వకపోతే ఇంకెవరిస్తారు అంటూ ట్వీట్‌ చేశారు.  దీంతో ఈ ట్వీట్‌ వైరల్‌ గా మారింది. 

ఇదీ చదవండి: ఐసీఐసీఐ,పీఎన్‌బీ ఖాతాదారులకు షాకింగ్‌ న్యూస్‌!

ఇది ఇలా ఉంటే బీజేపీ ఎంపీ, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్,  బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై మహిళా రెజ్లర్ల ఫిర్యాదుల మేరకు  ఢిల్లీలో రెండు ఎఫ్ఐఆర్లు నమదు కావడం సంచలనం రేపింది. ఏళ్లుగా తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపులపై ఫిర్యాదులకు స్పందించిన  ఢిల్లీ పోలీసులు కన్నాట్ ప్లేస్ పోలీస్ స్టేషన్‌ 10 ఫిర్యాదులను నమోదు చేశారు. తమను అనుచితంగా తాకి, లైంగిక వేధింపులతో మనోవేదనకు గురిచేశారని మహిళా రెజర్లు ఆరోపించారు. తన లైంగిక వాంఛ తీర్చాలంటూ  సింగ్‌ మహిళా రెజ్లర్లను వేధింపులకు గురిచేశారన్న ఆరోపణలో నమోదు చేశారు. 

2017, సెప్టెంబర్ లో  ఆసియా ఇండోర్ గేమ్స్ కోసం కర్ణాటకలోని బళ్లారిలో శిక్షణ పొందుతున్నప్పుడు, శిక్షణ సమయంలో, గాయపడి దాదాపు మరణశయ్యపై ఉంటే, ఈమెయిల్‌ ద్వారా రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు సమాచారం అందించినప్పటికీ నోటీసులు ఇచ్చారని, విచారణ కమిషన్‌ వేస్తామంటూ బెదిరించారని ఒక రెజ్లర్‌ వాపోయారు.  సింగ్‌తోపాటు వినోద్ తోమర్‌పై ఆరోపణలు గుప్పించారు.  
 (సూపర్‌ ఆఫర్‌: ఐపోన్‌13పై ఏకంగా రూ. 36వేల డిస్కౌంట్‌)

మరిన్ని వార్తలు