రుణాలు : తీసుకున్నది తిరిగి ఇచ్చేయండి, లేదంటే లావైపోతారు.

15 Jul, 2021 08:20 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: రుణాలు తీసుకోవడంలోనే కాదు ఇవ్వడంలోనూ యూత్‌ సత్తా చాటుతున్నారు. ఆన్‌లైన్‌ వేదికగా వ్యక్తుల నుంచి వ్యక్తులకు (పీర్‌ టు పీర్‌) మధ్య జరిగిన రుణ లావాదేవీలపై లెన్‌డెన్‌క్లబ్‌ విడుదల చేసిన 2020-21 అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. 12 లక్షల మంది సర్వేలో పాలుపంచుకున్నారు.


21 నుంచి 30 ఏళ్ల మధ్య వయసు ఉన్న యువతలో.. రుణాలు తీసుకున్నవారు 56 శాతం ఉంటే.. రుణాలు ఇచ్చినవారు 54 శాతం మంది ఉండడం విశేషం. లోన్స్‌ కోసం దరఖాస్తులన్నీ దాదాపు యాప్‌ ద్వారానే జరుగుతున్నాయి. అత్యవసర వైద్యానికి ఎక్కువగా అప్పులు చేశారు. అదికూడా రూ.25,000 వరకే. హైదరాబాదీయులు రుణాలు తీసుకోవడంలో మూడవ స్థానంలో, ఇవ్వడంలో రెండవ స్థానంలో నిలిచారు. విశేషమేమంటే రుణాలు ఇచ్చినవారిలో 19 శాతం మంది మహిళలు ఉన్నారు.   

మరిన్ని వార్తలు