శబాష్!! జొమాటో.. చెప్పింది చేసింది!

13 Jan, 2022 17:26 IST|Sakshi

రోడ్డు ప్రమాదంలో మరణించిన డెలివరీ బాయ్‌కు ప్రముఖ ఫుడ్‌ డెలివరీ సంస్థ జొమాటో అండగా నిలిచింది. సలీల్ త్రిపాఠి కుటుంబానికి రూ.10లక్షల బీమాను మంజూరు చేసింది. ఇదే విషయాన్ని జొమాటో సహవ్యవస్థాపకుడు దీపిందర్‌ గోయల్‌ అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు జొమాటో డెలివరీ బాయ్‌లు సైతం సలీల్‌ కుటుంబానికి రూ.12లక్షల మొత్తాన్ని వారి కుటుంబానికి అందించినట్లు ప్రశంసల వర్షం కురిపించారు. 

ఈ సందర్భంగా 'మా డెలివరీ పాట్నర్‌ (డెలివరీ బాయ్‌) సలీల్ త్రిపాఠి దురదృష్టవశాత్తూ రోడ్డు ప్రమాదంలో మరణించినందకు బాధపడుతున్నాం. ప్రమాదంలో ఒంటరైన బాధితుడి కుటుంబానికి అండగా నిలిచేలా అన్నీ విధాల సాయం అందిస్తున్నట్లు ట్వీట్‌ చేశారు. జొమాటో పాట్నర్‌ మరణిస్తే వారి కుటుంబానికి జొమాటో వ్యక్తిగతంగా సాయం అందిస్తుంది. ప్రమాదం జరిగిన రాత్రి సలీల్‌ కుటుంబంతో కలిసి ఆస్పత్రిలోనే ఉన్నాం. మరణించిన తర్వాత ఇతర ఖర్చుల కింద కుటుంబానికి సాహాయం చేశామని' దీపిందర్‌ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. 

ఇక డెలివరీబాయ్‌ మరణించిన వారి కుటుంబానికి ఎలాంటి అవసరాలున్నాయో.. వాటి అనుగుణంగా జొమాటో సాయంతో చేసేలా అండగా నిలుస్తోంది.సలీల్ భార్య సుచేతకు ఉద్యోగం కావాలంటే జొమాటో అన్ని ప్రయత్నాలు చేస్తుందని, తద్వారా ఆమె ఇంటిని పోషించడానికి, 10 ఏళ్ల కొడుకును చదివించేందుకు తోడ్పడుతుందని గోయల్ ట్వీట్‌లో ప్రస్తావించారు. 

తప్పతాగి 
గత శనివారం రాత్రి ఢిల్లీలో జొమాటోలో డెలివరీబాయ్‌ సలీల్‌ త్రిపాఠీ ఫుడ్‌ డెలివరీ ఇచ్చేందుకు వెళుతున్నాడు. అదే సమయంలో వేగంగా వెళుతున్న ఓ కార్‌ సలీల్‌ త్రిపాఠీ బైక్‌ను ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో బాధితుడు సలీల్‌ మరణించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.ఈ దర్యాప్తులో సలీల్‌ మరణానికి కానిస్టేబుల్‌ జిలే సింగ్‌ కారణమని నిర్ధారించారు. మద్యం మత్తులో సలీల్‌ మరణానికి కారణమైన జిలే సింగ్‌ను పోలీస్‌ శాఖ అతడిని సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది. 

చదవండి: శెభాష్‌ జొమాటో.. అందరూ ఇలా ఆలోచిస్తే బాగుండు!

మరిన్ని వార్తలు