కల నెరవేరె..!

18 Nov, 2023 00:48 IST|Sakshi
ప్రభుత్వం నిర్మించిన ఇల్లు

అద్దె ఇంట్లో ఇబ్బందులు పడ్డాం

మేము పలమనేరు పట్టణంలోని ఎంసీఆర్‌ నగర్‌లో 30 ఏళ్లుగా అద్దె ఇళ్లల్లోనే కాపురం ఉన్నాం. ఎన్నో ఇబ్బందులు పడ్డాం. ఈ ప్రభుత్వంలో మాకు ఇల్లు, స్థలం మంజూరైంది. ఇంటి నిర్మాణానికి సకాలంలో బిల్లులందాయి. దీంతో సొంత గూడు నిర్మించుకున్నాం. మాకు సొంతిల్లుంది అనుకుంటేనే చాలా సంతోషంగా ఉంది. ఎవరెన్ని మాట్లాడినా నా సొంతింటి కల జగనన్న ద్వారానే నిజమైంది. నేను ఎన్నటికీ జగనన్నను మరచిపోను. – బీబీజాన్‌, లబ్ధిదారు, పలమనేరు

రుణపడి ఉంటాం

మేము ఇప్పటి వరకు అద్దె ఇళ్లలోనే ఉన్నాం. గత ప్రభుత్వంలో ఇంటి స్థలం కోసం ఎన్నో అర్జీలు ఇచ్చాం. కార్యాలయాల చుట్టు కాళ్లు అరిగేలా తిరిగాం. అయినా వారు కనికరించలేదు. ఈ రోజు రేపు అంటు చెప్పారే తప్ప స్థలం, ఇల్లు ఇవ్వలేదు. జగనన్న ముఖ్యమంత్రి కాగానే మేము ఇంటి స్థలం కోసం అర్జీ పెట్టుకున్నాం. ఇంటి స్థలం ఇచ్చారు. సకాలంలో బిల్లులు మంజూరు చేయడంతో ఇళ్లు నిర్మించుకున్నాం. ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. – ఫజానా, తగ్గువారిపల్లె, బంగారుపాళ్యం మండలం

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకంతో జిల్లాలో వేలాదిమంది సొంతింటి కల నెరవేరింది. గూడు లేని నిరుపేదలకు శాశ్వత ఆశ్రయం లభించింది. ముఖ్యంగా ఆడపడుచులకు మోముపై చిరునవ్వులు తీసుకువచ్చింది. మహోన్నత ఆశయంతో మొదలుపెట్టిన పథకంపై జనవాక్కు. – చిత్తూరు కలెక్టరేట్‌

సొంత ఇంట్లో చేరా

నా వివాహ జీవితం ప్రారంభమైన నాటి నుంచి అద్దె ఇంట్లోనే ఉన్నా. రూ.150 అద్దె చెల్లించే రోజుల నుంచి రూ.5,500 అద్దె చెల్లించే వరకు బాడుగ ఇంట్లోనే ఉంటున్నాం. నా భర్త రోజు కూలీ మాకు సొంత ఇల్లు అన్నది కలగానే ఉండేది. జగనన్న చలువతో నాకు పట్టా ఇచ్చి స్థలం ఇచ్చారు. ఇల్లు కట్టుకోవడానికి ఆర్ధిక సహకారం అందించారు. మంత్రి రోజా సహాయంతో కాంట్రాక్టర్‌ ద్వారా ఇల్లు నిర్మించుకున్నాం. ప్రస్తుతం ఆ సొంతిట్లో చేరాం. ఇప్పుడు హాయిగా జీవనం సాగించగలమనే భరోసా వచ్చింది. – జి.శాంతి, లబ్ధిదారు, నగరి

జగనన్నకు కృతజ్ఞతలు

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పుణ్యమా అని సొంత స్థలం వచ్చింది. పక్కా గృహం కూడా మంజూరు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం ఆర్థిక సహాయం చేశారు. జగనన్నకు కృతజ్ఞతలు .– శారద, తాటిమోకులపల్లె, పెనుమూరు మండలం

మరిన్ని వార్తలు