మాటల మాయగాళ్లతో అప్రమత్తం

18 Nov, 2023 00:48 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ భరత్‌, పక్కన ఎంపీ రెడ్డెప్ప తదితరులు

శాంతిపురం: మాయమాటలతో ఏమార్చే టీడీపీ నేతలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్సీ భరత్‌ కోరారు. శుక్రవారం మండలంలోని గుంజార్లపల్లెలో నిర్వహించిన వై ఏపీ నీడ్స్‌ జగన్‌ కార్యక్రమంలో ఎంపీ రెడ్డెప్పతో కలిసి ఆయన పాల్గొన్నారు. ముందుగా వైఎస్సార్‌సీపీ జెండా ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్సీ మాట్లాడుతూ 2014 ఎన్నికల సమయంలో వందల హామీలు గుప్పించి, అధికారంలోకి వచ్చాక చంద్రబాబు ఏం చేశారో ఇప్పటికీ జనం మరువలేదన్నారు. మహిళలకు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని నకిలీ ఏటీఎం కార్డులు ఇచ్చి ఓట్లు వేయిచుకున్నారని గుర్తు చేశారు. రైతుల రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని మోసం చేశారని విమర్శించా. మళ్లీ అలాగే మాయలు చేసేందుకు డ్రామా పార్టీ వారు వస్తున్నారని హెచ్చరించారు. తన భవిష్యత్‌కు, తనను నమ్ముకున్న వారి భవిష్యత్‌కు గ్యారెంటీ ఇవ్వలేని వ్యక్తి జనం భవిష్యత్‌కు ఏం గ్యారెంటీ ఇస్తారో ఆలోచించాలని కోరారు. గతంలో ఇచ్చిన ఏటీఎం కార్డులను నమ్మినట్టు ఈ దఫా భవిష్యత్‌ గ్యారెంటీ కార్డును నమ్మితే నిండా మునిగిపోతారని స్పష్టం చేశారు. గత ఐదేళ్లలో ప్రతి ఒక్కరికీ చేసిన మేలును వివరించి, మళ్లీ వైఎస్సార్‌సీపీని ఆశీర్వదించాలని కోరుతున్నామని తెలిపారు. నాలుగున్నరేళ్లలో జగనన్న చేసిన మేలును ఎవరూ మరచిపోరన్నారు. మరింత మంచి జరగాలంటే మళ్లీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఎంపీ రెడ్డెప్ప మాట్లాడుతూ సంక్షేమ పథకాలతో ప్రతి కుటుంబానికి నేరుగా బ్యాంకు ఖాతాల ద్వారా రూ.లక్షలు అందించిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మళ్లీ ఆశీర్వదించాలని కోరారు. గుంజార్లపల్లి పంచాయతీ ప్రజలకు గత నాలుగేళ్లలో రూ.20 కోట్లు పథకాల ద్వారా అందించామని వెల్లడించారు. కరోనా సమయంలో వలంటీర్లు, సచివాలయ సిబ్బంది ప్రతి ఇంట్లో మనిషిగా సేవ చేశారని చెప్పారు. లంచాలు, వివక్ష లేకుండా ఇప్పుడు ఇంటి గడప వద్దనే పథకాలు అందుతున్నాయని, గతంలో జన్మభూమి కమిటీలను ప్రసన్నం చేసుకున్న వారికి మాత్రమే పనులు జరిగాయని వివరించారు. త్వరలోనే హంద్రినీవా ద్వారా కుప్పం చెరువులకు నీరు వస్తుందని తెలిపారు. కార్యక్రమంలో రెస్కో వైస్‌ చైర్మన్‌ కోదండరెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు శ్రీనివాసులు, పార్టీ మండల కన్వీనర్‌ బుల్లెట్‌ దండపాణి, వైస్‌ ఎంపీపీ పట్టాభి, ఎంపీటీసీ సభ్యులు రవిరెడ్డి, బీఎన్‌ వెంకటేశు, చలం, నాయకులు సోమారెడ్డి, కోదండరెడ్డి, రమేష్‌, భాస్కర్‌, మురుగేష్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు