‘దయచేసి ఆ అబ్బాయికి శిక్ష పడేలా చేయండి’

20 Dec, 2020 10:26 IST|Sakshi

గుంటూరు జిల్లాలో ఘటన

సాక్షి, గుంటూరు: జిల్లాలోని మేడికొండూరు మండలం కొర్రపాడులో విషాదం చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో వరప్రసాద్‌ అనే యువకుడు వేధించడంతో టెన్త్‌ క్లాస్‌ విదార్థిని సౌమ్య పురుగులమందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించగా.. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం ప్రాణాలు విడిచింది. వరప్రసాద్‌ వేధింపులు భరించలేకనే ఆత్మహత్యకు చేసుకున్నట్టు సౌమ్య వెల్లడించింది.

వరప్రసాద్ వల్లే తాను చనిపోతున్నానని బాధితురాలు వీడియోలో ఆవేదన వ్యక్తం చేసింది. అతన్ని కఠినంగా శిక్షించాలని కోరింది. కాగా,  ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు గుంటూరు రూరల్‌ ఎస్పీ ప్రత్యేక బలగాలను ఏర్పాటు చేశారు. ఇదిలాఉండగా.. తాడికొండ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి బాధిత కుంటుంబాన్ని పరామర్శించారు. నిందితుడికి శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని హామినిచ్చారు.

మరిన్ని వార్తలు