ఇద్దరు మైనర్లపై 11 మంది గ్యాంగ్‌ రేప్‌..

1 Aug, 2020 09:41 IST|Sakshi

రాయ్‌పూర్‌ : దేశంలో మృగాలు మనుషుల ముసుగుతో మానవత్వం మంటగలిసేలా ప్రవర్తిస్తున్నారు. సమాజానికి మాయని మచ్చను తీసుకొస్తున్నారు. మహిళల రక్షణకు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా నానాటికీ వారిపై దాడులు పెరుగుతూనే ఉన్నాయి. ఇటీవల త్రిపురలో ఓ యువతిపై అయిదుగురు సామూహిక అఘాయిత్యానికి పాల్పడిన ఘటన మరవకముందే మరో పైశాచిక సంఘటన ఛత్తీస్‌గఢ్‌లో‌ వెలుగు చూసింది. బలోదబజార్‌ జిల్లాలో ఇద్దరు మైనర్‌ అక్కాచెల్లెల్లపై 11 మంది అత్యంత పాశవికంగా అత్యాచారానికి ఒడిగట్టారు. వీరిలో ముగ్గురు మైనర్లు ఉండటం గమనార్హం. అంతేగాక ఈ దృశ్యాలను వీడియో తీసి ఈ విషయం గురించి బయటకు చెప్తే ఆ వీడియోను సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేస్తామని బాధితులను బెదిరింపులకు గురి చేశారు. ఇదిలా ఉండగా ఈ అమానుష ఘటన జరిగిన రెండు నెలలకు వెలుగులోకి రావడం మరింత దారుణం. (యువతిపై సామూహఙక అత్యాచారం‌; 10 మంది అరెస్ట్‌)

పోలీసుల వివరాల ప్రకారం. ఇద్దరు బాలికలపై గ్రామానికి చెందిన ఎనిమిది మంది యువకులు, 3 మైనర్లు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు బలోదాబజార్‌ ఎస్పీ తెలిపారు. మే 31న నిందితులు వీడియో రికార్డు చేసి బాలికలను బెరించారని, అందువల్లే నేరం గురించి పోలీసులకు సమాచారం అందలేదని పేర్కొన్నారు. జూలై 29న మైనర్‌ బాలికలు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తమ వద్ద అత్యాచార వీడియో ఉందని బాధితుల్లో ఒక బాలికలకు తెలియని నంబర్‌ నుంచి ఫోన్‌ కాల్స్‌ వస్తున్నాయని, ఆమె తనను కలవకపోతే వీడియోను వైరల్‌ చేస్తానని బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నట్లు పేర్కొన్నారు. నిందితుల్లో ఒకరు బాధితుల బంధువు ఉన్నట్లు, ప్రస్తుతం మొత్తం 11 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. (ఇష్టంలేని పెళ్లో.. లేక చదువు ఆగిపోతుందనో..)

మరిన్ని వార్తలు