ఘాతుకం: కన్నతల్లి కంటే ప్రియుడే ఎక్కువయ్యాడు..

28 Mar, 2022 14:14 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

తిరువొత్తియూరు(చెన్నై): బాయ్‌ ఫ్రెండ్‌తో మాట్లాడడాన్ని ఖండించిందనే కోపంతో ఓ బాలిక తన తల్లిని హత్య చేసింది. వివరాలు.. తూత్తుకుడి కార్పొరేషన్‌ చాకలిపేట రెండో వీధిలో మాడస్వామి. మునిలక్ష్మి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ క్రమంలో మునిలక్ష్మి శనివా రం రాత్రి హత్యకు గురైంది. తూత్తుకుడి పోలీసు లు మునిలక్ష్మి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్ష కోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

విచారణలో మునిలక్ష్మి కుమార్తె (17) రాజీవ్‌నగర్‌కు చెందిన కన్నన్‌ (20), ముత్తయ్యపురానికి చెందిన తంగకుమా ర్‌ (22)తో స్నేహం కలిగి ఉందని తేలింది. అలాగే తంగ కుమార్‌కు, ఈ బాలికకు ప్రేమ వ్యవహారం నడుస్తుండడంతో మునిలక్ష్మి దాన్ని తీ వ్రంగా ఖండించినట్టు తెలిసింది. దీంతో ఆగ్రహించిన బాలిక, కన్నన్, తంగకుమార్, మరోస్నేహితుడితో కలిసి మునిలక్ష్మిపై దాడి చేసి నోటిలో గుడ్డపెట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. పోలీసులు కన్నన్‌ను అరెస్టు చేశారు. తంగకుమార్, అతని స్నేహితుడు పరారీలో ఉన్నారు.

మరిన్ని వార్తలు