యువకుడి ఆత్మహత్యకు కారణం అదేనా..

6 Jun, 2021 18:01 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

లక్నో: ఉత్తర ప్రదేశ్​లో దారుణం చోటుచేసుకుంది. 19 ఏళ్ల యువకుడు సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..  హమిర్​పూర్​ జిల్లా జాఖరీ గ్రామానికి చెందిన లక్ష్మీ ప్రసాద్​ ప్రజాపతి అనే యువకుడు రాజస్థాన్​లోని అల్వాల్​ జిల్లాలో ఒక ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. 

ఈ క్రమంలో, తను ఒక యువతిని ప్రేమించాడు. ఆమెను వివాహం చేసుకోవాలనుకున్నాడు. అయితే, లక్ష్మీ ప్రసాద్ ప్రేమను అతని, తల్లిదండ్రులు అంగీకరించలేదు. వారిని ఒప్పించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అయినా వాళ్లు ఒప్పుకోలేదు. ఇదిలా ఉండగా లక్ష్మీ ప్రసాద్ ఒక రోజు ఆఫీస్​ నుంచి ఇంటికి వస్తుండగా.. తాను ప్రేమించిన యువతి వేరే అబ్బాయితో పెళ్లికి ఒప్పుకుందనే విషయం తెలిసింది. ఈ విషయాన్ని అతను జీర్ణించుకోలేకపోయాడు.

దీంతో నేరుగా వ్యవసాయ భూమికి చేరుకున్నాడు. అక్కడ, తీవ్ర ఆవేదనకు లోనై ఏడుస్తూ..  సెల్ఫీవీడియో తీసి బంధువులకు, తన మిత్రులకు పంపించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే, యువకుడి తల్లిదండ్రులు వెంటనే పోలీసు​లకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు సెల్​ఫోన్​ సిగ్నల్​ ఆధారంగా సంఘటన స్థలానికి చేరుకున్నారు. చెట్టుకు ఉరివేసుకుని విగతజీవిగా  ఉన్న సదరు యువకుడిని కిందకు దించి ఆస్పత్రికి తరలించారు. కేసును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు