మాస్క్‌ ధరించండి! అన్నందుకు.. కాల్చి చంపేశాడు

13 Sep, 2022 15:53 IST|Sakshi

జర్మన్‌: మాస్క్‌ ధరించాలని చెప్పినందుకు ఒక వ్యక్తి పెట్రోల్‌ బంక్‌ క్యాషియర్‌ని తుపాకితో కాల్చి చంపాడు. ఈ ఘటన జర్మనీలో చోటుచేసుకుంది. జర్మనీ కరోనా దృష్ట్యా వ్యాక్సినేషన్‌ ఉద్యమం ప్రారంభమైంది. అందులో భాగంగా అక్కడ ఉండే జర్మన్‌లందరూ మాస్క్‌ ధరించడం తప్పనిసరి. ఈ నేపథ్యంలోనే మారియో ఎన్‌ అనే వ్యక్తి సిక్స్‌ ప్యాక్‌ బీర్‌ను కొనుగోలు చేసేందుకు ఒక స్టోర్‌కి వెళ్లాడు. అ‍ప్పుడు ముసుగు ధరించాడు.

ఆ తర్వాత కొనుగోలు అయిపోయింది కదా అని మాస్క్‌ తీసేసి పెట్రోల్‌ బంక్‌ వద్దకు వచ్చాడు. అక్కడ క్యాషియర్‌గా పనిచేస్తున్న 20 ఏళ్ల విద్యార్థి మాస్క్‌ ధరించండి అని చెప్పాడు. అంతే కోపంతో అతని నుదిటి పై పాయింట్‌ బ్లాక్‌లో గన్‌పెట్టి పేల్చాడు. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన జర్మనీని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. నిందితుడు మారియో అక్రమంగా తుపాకి కలిగి ఉన్నందుకు జర్మన్‌ పోలీసులు అతడిని అరెస్టు చేశారు. అంతేగాదు హత్యానేరం రుజువుకావడంతో జర్మన్‌ కోర్టు అతడిని దోషిగా నిర్ధారించి జీవిత ఖైదు విధించింది.

(చదవండి: ఉక్రెయిన్‌దే విజయమా? రష్యా ఓడిపోవడం ఖాయమా?)
 

మరిన్ని వార్తలు