వీడు మామూలోడు కాదు.. బొమ్మ తుపాకితో బెదిరించి..

10 Aug, 2021 19:11 IST|Sakshi

సాక్షి, శ్రీకాకుళం: ఇచ్ఛాపురం పట్టణం డైలీమార్కట్‌ వద్ద ఉన్న జీకే బంగారు దుకాణంలోకి సోమవారం సాయంత్రం ఓ వ్యక్తి ప్రవేశించాడు. గొలుసు చూపించమని యజమాని జి.మిథున్‌ చక్రవర్తిని కోరాడు. దీంతో నిజమని నమ్మిన ఆయన గొలుసులు చూపిస్తుండగా సదరు వ్యక్తి దుస్తుల్లో ఉంచిన తుపాకీని బయటకు తీసి మిథున్‌ చక్రవర్తిని బెదిరించి మూడు గొలుసులను పట్టుకొని పారిపోయాడు.

క్షణాల్లో తేరుకున్న అతను కేకలు వేస్తూ వెంబడించగా.. స్థానికులు కూడా జతకలిసి పరుగు పెట్టారు. నిందితుడు నర్మదేశ్వర ఆలయం వెనుక కోటీ కాంప్లెక్సు వద్ద పట్టబడ్డాడు. అతన్ని పట్టణ పోలీసులకు అప్పగించారు. అతని వద్ద నుంచి రెండు తులాల బరువున్న మూడు బంగారు గొలుసులను స్వాధీనం చేసుకొన్నారు. తుపాకీని కూడా స్వాధీనం చేసుకొని పరిశీలించగా అది బొమ్మదిగా నిర్ధారించారు. పట్టుబడిన వ్యక్తి ఒడిశాలోని రాయగడకు చెందిన రాఖీడిగాల్‌గా గుర్తించారు. షాపు యజమాని ఫిర్యాదు మేరకు పట్టణ ఎస్‌ఐ వి సత్యనారాయణ కేసు నమోదు చేశారు.  

మరిన్ని వార్తలు