పనిమనిషితో వివాహేతర సంబంధం.. బెడ్‌పై గుండెపోటుతో మృతి.. భర్తకు ఫోన్ చేసిన భార్య..

25 Nov, 2022 14:07 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

బెంగళూరు: కర్ణాటక బెంగళూరులో కొద్ది రోజుల క్రితం ప్లాస్టిక్‌ బ్యాగ్‌లో ఓ శవం లభించిన విషయం కలకలం రేపిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగుచూశాయి. ఈ 67 ఏళ్ల వ్యాపారవేత్తకు తన ఇంట్లో పనిచేసే 35 ఏళ్ల మహిళతో వివాహేతర సంబంధం ఉందని పోలీసులు తెలిపారు. నవంబర్ 16న ఆమె ఇంటికి వెళ్లి శృంగారం చేస్తూ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడని వెల్లడించారు.

తన యజమానితో వివాహేతర సంబంధం ఉందని అందరికీ తెలిస్తే పరువు పోతుందని మహిళ భావించింది. దీంతో అతడు చనిపోయిన విషయాన్ని భర్తతో పాటు సోదరుడికి ఫోన్ చేసి చెప్పింది. ఆ తర్వాత వాళ్లు వచ్చాక ముగ్గురు కలిసి శవాన్ని ఓ ప్లాస్టిక్ బ్యాగ్‌లో ప్యాక్ చేశారు. అనంతరం తీసుకెళ్లి రోడ్డు పక్కన పడేశారు. అని పోలీసులు వివరించారు.

చనిపోయిన వ్యక్తి పేరు బాల సుబ్రహ్మణ్యం. జేపీ నగర్‌లో నివసించేవాడు. నవంబర్ 16 సాయంత్ర 4:55 గంటలకు తన మనవడ్ని బ్యాడ్మింటన్ కోర్టులో డ్రాప్ చేసేందుకు వెళ్లాడు. ఆ తర్వాత తనకు వ్యక్తిగత పని ఉందని, ఆలస్యంగా వస్తానని కోడలుకు ఫోన్ చేసి చెప్పాడు. 

కానీ ఆ తర్వాత బాల సుబ్రహ్మణ్యం ఇంటికి తిరిగివెళ్లలేదు. దీంతో ఆయన కుమారుడు మరుసటి రోజే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి మిస్సింగ్ కేసు పెట్టాడు. ఆ మరునాడే పోలీసులకు ఓ ప్లాస్టిక్ బ్యాగ్‌లో బెడ్ షీట్లు చుట్టి ఉన్న ఓ శవం కన్పించింది. అతడ్ని బాలసుబ్రహ్మణ్యంగా గుర్తించారు.

‍‍కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులకు పనిమనిషి అసలు విషయం చెప్పింది. ఆయనతో చాలా కాలంగా వివాహేతర సంబంధం ఉందని తెలిపింది. అతను శృంగారం చేస్తూ బెడ్‌పైనే చనిపోయాడని చెప్పింది. తామే శవాన్ని బ్యాగులో చుట్టి రోడ్డు పక్కన పడేశామని అంగీకరించింది.
చదవండి: యువతి అదృశ్యం.. అర్ధరాత్రి మెలకువ రావడంతో..

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు