నిశ్చితార్థం ఒకరితో.. పెళ్లి మరొకరితో

17 Apr, 2021 11:20 IST|Sakshi

సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌పై కేసు   

మహానంది: నిశ్చితార్థం ఒకరితో చేసుకొని, మరో యువతిని పెళ్లాడిన సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌పై కేసు నమోదు చేసినట్లు మహానంది ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.  శిరివెళ్ల మండలం గుంప్రమానుదిన్నె గ్రామానికి చెందిన సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌ మధుభాస్కర్‌తో మహానంది మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన ఓ యువతికి జనవరి 16న నిశ్చితార్థం అయ్యింది.

అయితే మధుభాస్కర్‌ బండి ఆత్మకూరు మండలం ఈర్నపాడు గ్రామానికి చెందిన యువతిని ఈ నెల 15వ తేదీన వివాహం చేసుకున్నాడు. ఇదేం న్యాయమని బాధితురాలి కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తే ఎక్కువ కట్నం ఇచ్చారు అని  సమాధానమిచ్చారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు  ఎస్‌ఐ తెలిపారు.
చదవండి:
కలవరపెట్టిన ఆరడుగుల శ్వేతనాగు..  
పెళ్లిరోజు.. అంతలోనే ఊహించని విషాదం

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు