కిరాయి చెల్లించలేదని ఖాకీ కిరాతకం

2 Aug, 2020 20:38 IST|Sakshi

ఒంటికి నిప్పంటించుకున్న పెయింటర్‌

చెన్నై : ఇంటి అద్దె చెల్లించనందుకు ఓ పోలీస్‌ అధికారి కొట్టడంతో పెయింటర్‌ ఒంటికి నిప్పంటించుకున్న ఘటన చెన్నైలో వెలుగుచూసింది. నగరంలోని పుజాల్‌ ప్రాంతంలో కుటుంబంతో కలిసి నివసించే పెయింటర్‌ శ్రీనివాసన్‌ నాలుగు నెలలుగా అద్దె చెల్లించలేదు. కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్‌తో ఆదాయం కోల్పోయిన శ్రీనివాసన్‌ అద్దె చెల్లించలేకపోయాడు. దీంతో ఇల్లు ఖాళీ చేయాలని ఇంటి యజమాని రాజేంద్రన్‌ పలుమార్లు శ్రీనివాసన్‌ను హెచ్చరించాడు. శ్రీనివాసన్‌పై పుజాల్‌ పోలీస్‌ స్టేషన్‌లో రాజేంద్రన్‌ ఫిర్యాదు చేశాడు. యజమాని ఫిర్యాదుతో ఇన్‌స్పెక్టర్‌ శామ్‌ బెన్సన్‌ తన ఇంటికి వచ్చి భార్యా పిల్లల సమక్షంలో తనను తీవ్రంగా కొట్డాడని శ్రీనివాసన్‌ ఆరోపించాడు. మనోవ్యథతో శ్రీనివాసన్‌ తన ఒంటికి నిప్పంటించుకున్నాడు. 80 శాతం కాలిన గాయాలతో శ్రీనివాసన్‌ కిల్పాక్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శ్రీనివాసన్‌పై దాడికి పాల్పడిన ఇన్‌స్సెక్టర్‌ను అధికారులు సస్సెండ్‌ చేశారు.

చదవండి : కూతుర్ని హతమార్చి నాటకం

మరిన్ని వార్తలు