డబ్బులు ఎవ్వరికీ ఊరికే రావు: సజ్జనార్‌

5 Oct, 2020 18:51 IST|Sakshi

సైబరాబాద్‌లో క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠా అరెస్ట్‌

8 మంది సభ్యుల ముఠాను పట్టుకున్న బాలానగర్ ఎస్ఓటీ 

సాక్షి, హైదరాబాద్‌: సైబరాబాద్‌లో క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠాను పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేశారు. ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. 22 లక్షలకు పైగా నగదును స్వాధీనం చేసుకోగా, తొమ్మిది మంది పరారీలో ఉన్నారు. సీపీ సజ్జనార్‌  మీడియాకు వివరాలను వెల్లడించారు. చందూర్ శశాంక్ అనే ప్రధాన బూకీతో పాటు మరో ఏడుగురిని అరెస్ట్‌ చేశామని తెలిపారు. భర్కత్ అనే ప్రధాన బుకీ పరారీలో ఉన్నాడని, మొబైల్ ఫోన్ లోనే ఈ బెట్టింగ్ నిర్వహిస్తున్నాడని పేర్కొన్నారు. (చదవండి: జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై ఈసీ కీలక నిర్ణయం)

బెట్ 365, డ్రీం 11, ఎంపీఎల్, బెట్ వే, డ్రీంగురు, మై 11 సర్కిల్, బెట్ 365, కోరల్, బివిన్, 777  బెట్, డెఫాబెట్, విన్నర్, క్రికెట్ బెట్టింగ్ 2020, జస్ట్ బెట్, బెట్‌ఫ్రడ్‌, లోటస్ క్రికెట్ లైన్ తదితర మొబైల్ యాప్‌లలో వచ్చే రేటింగ్‌లు ద్వారా బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారని వెల్లడించారు. ఎవరికైనా బెట్టింగ్‌లకు సంబంధించిన సమాచారం తెలిస్తే 9490617444 నంబర్‌కు కాల్ చేయాలని సీపీ విజ‍్క్షప్తి చేశారు. ‘‘స్టూడెంట్స్ ఎక్కువగా బెట్టింగ్‌లలో పార్టీసిపెట్ చేస్తున్నారు. డబ్బు ఎవ్వరికీ ఊరికే రావు. కష్టపడాలి. రాత్రికి రాత్రే శ్రీమంతుడు అవ్వాలనుకోవడం కరెక్ట్‌ కాదు. బెట్టింగులకు నగర యువత దూరంగా ఉండాలని’’ సీపీ సజ్జనార్‌ విజ్ఞప్తి చేశారు.(చదవండి: వెట్టిచాకిరి నుంచి చిన్నారులకు విముక్తి..)

మరిన్ని వార్తలు