భారీగా బంగారం పట్టివేత 

27 Nov, 2022 01:44 IST|Sakshi

శంషాబాద్‌: ఇద్దరు ప్రయాణికులు అక్రమంగా  తరలించేందుకు ప్రయత్నించిన బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్‌ అధికారులు చేపట్టిన తనిఖీల్లో  శనివారం ఉదయం దుబాయ్‌ నుంచి వచ్చిన  ప్రసాద్‌గౌడ్‌ అనే వ్యక్తి బంగారు బిస్కెట్లు ఉన్న లగేజీని కస్టమ్స్‌ కంటపడకుండా తరలించేందకు యత్నించాడు. అతడి కదలికలను అనుమానించిన అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టడంతో లగేజీలో 2.1 కేజీ బరువు కలిగిన బంగారు బిస్కెట్లు బయటపడ్డాయి.

బంగారం విలువ రూ.కోటి ఉంటుందని నిర్ధారించారు. ఈ మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేపడుతున్నారు. ప్రసాద్‌గౌడ్‌ క్యారియర్‌గా బంగారాన్ని తరలించేందుకు యత్నించినట్లు అనుమానిస్తున్నారు. అలాగే కువైట్‌ నుంచి కేయూ–373 విమానంలో వచ్చిన అహ్మద్‌ అబ్దుల్‌ రెహమాన్‌ అనే వ్యక్తి కదలికలను అనుమానించి అతడి లగేజిని తనిఖీ చేయగా 268 గ్రాముల బంగారాన్ని బయటికి తీశారు. బంగారం విలువ రూ.12 లక్షలు ఉంటుదని నిర్ధారించారు. ఈ మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.   

మరిన్ని వార్తలు