కారు పేరుతో 1.92 లక్షలు టోపీ 

2 May, 2021 14:24 IST|Sakshi

సాక్షి, హోసూరు: సైబర్‌ మోసగాళ్లు ఓ వ్యాపారికి రూ.1.92 లక్షలకు టోపీ వేశారు. క్రిష్ణగిరి వెల్లగుట్ట ప్రాంతానికి చెందిన  వరదరాజ్‌ (44) ఆగ్రో సర్వీస్‌ వ్యాపారి. ఇతనికి కొన్నిరోజుల క్రితం ఓ వ్యక్తి ఫోన్‌ చేసి తాను కార్ల డీలర్‌నని, మీకు డ్రాలో కారు తగిలిందని, షిప్పింగ్‌ రుసుము రూ.1.92 లక్షలు చెల్లిస్తే వెంటనే కారును పంపిస్తామని చెప్పాడు. నిజమేననుకున్న వరదరాజ్‌ తన మొబైల్‌ఫోన్‌ నుంచి ఆ మొత్తాన్ని డిపాజిట్‌ చేశాడు. ఆ తరువాత ఆ వ్యక్తికి ఫోన్‌ చేస్తే స్విచ్చాఫ్‌ అని రావడంతో మోసపోయినట్లు తెలుసుకుని క్రిష్ణగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

మరిన్ని వార్తలు