సూడాన్‌ స్మగ్లర్ల నుంచి 100 కిలోల బంగారం సీజ్‌

22 Feb, 2023 14:00 IST|Sakshi

ముంబై: భారత్‌–నేపాల్‌ సరిహద్దుల గుండా బంగారాన్ని అక్రమంగా తరలించే ముఠాకు చెందిన ఏడుగురు సూడాన్‌ దేశస్తులు సహా 10 మంది అదుపులోకి తీసుకున్నట్లు డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌(డీఆర్‌ఐ) మంగళవారం తెలిపింది. వారి నుంచి రూ.51 కోట్ల విలువైన 101 కిలోల బంగారాన్ని పట్టుకున్నట్లు వెల్లడించింది.

పట్నా, పుణే, ముంబైల్లో‘ఆపరేషన్‌ గోల్డెన్‌ డాన్‌’పేరిట చేపట్టిన ఆపరేషన్‌లో ఈ ముఠా నుంచి రూ.1.35 కోట్ల దేశ, విదేశీ కరెన్సీ కూడా స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. పేస్ట్‌ రూపంలో బంగారాన్ని భారత్‌–నేపాల్‌ సరిహద్దుల గుండా పటా్నకు అక్కడి నుంచి ముంబై సహా దేశంలోని వేర్వేరు ప్రాంతాలకు, వేర్వేరు మార్గాల్లో ఈ ముఠా రవాణా చేస్తోందని డీఆర్‌ఐ వివరించింది.

చదవండి  వామ్మో.. భారతీయులు ప్రయాణాలపై నెలకు ఎంత ఖర్చు పెడుతున్నారో తెలుసా!

మరిన్ని వార్తలు