రూ.468 కోట్ల విలువైన మాదకద్రవ్యాలు ధ్వంసం

11 Oct, 2023 04:19 IST|Sakshi

రూ.40 లక్షల విదేశీ సిగరెట్లు సైతం

శంషాబాద్‌ (హైదరాబాద్‌): ఆర్‌జీఐ విమానాశ్రయంతో పాటు వివిధ ప్రాంతాల్లో అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడ్డ రూ.468 కోట్ల విలువైన మాదకద్రవ్యాలతో పాటు విదేశీ సిగరెట్లను హైదరాబాద్‌ కస్టమ్స్‌ అధికారులు ధ్వంసం చేశారు. మేడ్చల్‌ జిల్లా దుండిగల్‌లో హైదరాబాద్‌ వేస్ట్‌మేనేజ్‌మెంట్‌ ప్రాజెక్టులో భాగంగా అధికారులు మంగళవారం ఈ ప్రక్రి యను పూర్తి చేశారు.

ధ్వంసం చేసిన వాటిలో రూ.95.37 కోట్ల విలువ చేసే 27 కేజీల హెరాయిన్, రూ.272.55 కోట్ల విలువ చేసే 136 కేజీల మెఫిడోన్, రూ.కోటి విలువ చేసే 52 కేజీల గంజాయితోపాటు ఆర్‌జీఐ విమానా శ్రయంలో పట్టుడిన రూ.40 లక్షల విలువ చేసే విదేశీ సిగరెట్లు కూడా ఉన్నాయి. నైజీరియా, టాంజానియా, దక్షిణాఫ్రికా, బెనియోనాయస్‌ దేశాలకు చెందిన పౌరులతో పాటు మనదేశానికి చెందిన వారి నుంచి కస్టమ్స్‌ అధికారులు, డైరెక్టర్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారులు కలిసి వీటిని పట్టుకున్నారు.

మరిన్ని వార్తలు