అన్నదమ్ములతో మహిళ వివాహేతర సంబంధం.. రెండు సార్లు పారిపోయి..

15 Oct, 2022 20:46 IST|Sakshi

సాక్షి, చెన్నై:  వివాహేతర సంబంధంలో ప్రియుడు తన తండ్రితో కలసి ప్రియురాలిని హత్య చేశాడు. ఈ కేసులో నిందితుడితోతోపాటు అతడి తండ్రిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాల మేరకు.. అరియలూరు జిల్లా తాపలూ ర్‌కు చెందిన శక్తివేల్‌ కూలి పనిచేసి, జీవిస్తున్నా డు. ఇతనికి భార్య సత్య (30), ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా మేల్‌కుడికాడు గ్రామానికి చెందిన అమృతరాజ్‌ (24)తో సత్య కు వివాహేత సంబంధం ఏర్పడింది. అతనితో కలిసి వెల్లకోయిల్‌కు వెళ్లింది. అయితే శక్తివేల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీసులు సత్యను గుర్తించి, ఆమెను మందలించి భర్తతో కలిసి జీవించమని పంపించారు.

అయితే ఆ తర్వాత సత్యకు అమృతరాజ్‌ తమ్ముడు దేవాతో  వివాహేతర సంబంధం ఏర్పడి, అతనితో సత్య పారిపోయింది. దీంతో విసిగిపోయిన శక్తివేల్‌ తన ఇద్దరు పిల్లలను తల్లిదండ్రుల వద్ద వదలిపెట్టి పని కోసం మలేషియా వెళ్లాడు. ఈ క్రమంలో మామ ఇంట్లో ఉన్న సత్యకు అమృతరాజ్‌కు మధ్య డబ్బు వ్యవహారంలో గొడవ ఏర్పడింది. దీంతో అమృతరాజ్‌ అతని తండ్రి దేవేంద్రన్‌ కలసి సత్యపై కత్తితో దాడి చేసి, హతమార్చారు. ఈ విషయమై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, అమృతరాజ్‌ అతని తండ్రి దేవేంద్రన్‌ (57)ను అరెస్టు చేసి, విచారణ జరపుతున్నారు.
చదవండి: విషాదం.. ప్రాణాలు కాపాడే అంబులెన్సే మృత్యుపాశమైంది..!

మరిన్ని వార్తలు