ప్రియురాలు పని చేసే చోట దొంగతనం.. పాపం పోవాలని పూజలు..

13 Oct, 2021 16:07 IST|Sakshi
దొంగతనం చేసి పారిపోతున్న నిందితుల సీసీటీవీ పుటేజ్‌

భోపాల్‌: ఫేస్‌బుక్‌లో ఓ వ్యక్తికి ఒక అమ్మాయితో పరిచయం ఏర్పడింది. కొన్ని రోజుల తర్వాత అది కాస్త ప్రేమగా మారింది. ఈ అమ్మాయి 8 సంవత్సరాలుగా ఓ వృద్ధురాలి ఇంట్లో పనిచేస్తోంది. దీంతో తన ప్రియురాలిని కలవడానికి ఆ వ్యక్తి అప్పుడప్పుడు వృద్ధురాలి ఇంటికి వెళ్లేవాడు. అలా వెళ్లిన ప్రతీసారి ఆ యువకుడు కన్ను ఆ మహిళ ఒంటిపై ఉన్న నగలపై పడింది. అలా  ఓ రోజు తన ప్రియురాలు ఆ ఇంట్లో లేదని తెలుసుకున్నాడు. అదే అదునుగా భావించి తన స్నేహితునితో కలిసి ఒంటరిగా ఉన్న వృద్ధురాలి ఇంట్లోకి వెళ్లాడు. (చదవండి: గడ్డి కోసం వెళ్లిన మహిళపై తుపాకితో బెదిరించి సామూహిక లైంగిక దాడి)


ఆమె అరవకుండా నోట్లో గుడ్డ కుక్కి నగలను, సొమ్మును వారిద్దరు దోచుకున్నారు. ఆ ఇంట్లోకి వచ్చిన ప్రియురాలు కూడా ఎవరో దొంగలు వచ్చారే అనుకుంది. ఈ విషయం చుట్టుపక్కలవాళ్లకు తెలియడంతో పోలీసులకు సమాచారం చేరవేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ పుటేజ్‌ ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కాగా విచారణలో వారు.. ఈ దోపిడీ తరువాత,  నేరుగా ఉజ్జయినికి వెళ్లామని, అక్కడ బాబా మహాకల్‌ను దర్శనం చేసుకుని క్షమాపణ చెప్పడంతో పాటు అక్కడ దానధర్మాలు కూడా చేసినట్లు పోలీసులకు తెలిపారు. అయితే, ఈ ఘటన  గురించి ఆ బాలికకు ఎటువంటి సంబంధం లేదని పోలీసులు చెబుతున్నారు.

చదవండి: Uthra Murder Case: కసాయి భర్త కేసులో కోర్టు సంచలన తీర్పు

మరిన్ని వార్తలు