-
సీఎం జగన్ పెద్ద కొడుకులా 3 వేలు పెన్షన్ ఇస్తున్నారు: వృద్ధురాలు
-
వారెవ్వా.. బామ్మా! ఒకేరోజు మూడు ప్రపంచ రికార్డులు
రికార్డులకు, అవార్డలుకు వయస్సుతో పనేముందని నిరూపించిందో బామ్మ. 99 ఏళ్ల వయసులో ఈజీగా ఈత కొట్టడం మాత్రమే కాదు. ఒకే రోజు ఏకంగా మూడు ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టింది. డచ్-కెనడియన్ బెట్టీ బ్రస్సెల్ ఈ నెల 20న అద్భుతమైన ఈ ఫీట్ సాధించింది. 400-మీటర్ల ఫ్రీస్టైల్, 50 మీటర్ల బ్రెస్ట్ స్ట్రోక్ 50-మీటర్ల బ్యాక్ అనే మూడు విభాగాల్లో తన సత్తా చాటింది. తనకు ఏజ్ అస్సలు మేటర్ కాదంటోంది. ఇదీ చదవండి: ఏకంగా రూ.7 కోట్ల భూమిని విరాళమిచ్చిన మహిళ, ఎందుకో తెలుసా? స్విమ్మింగ్ కెనడా లెక్కల ప్రకారం 12 నిమిషాల 50 సెకన్లతో ఉన్న 400-మీటర్ల ఫ్రీస్టైల్ రికార్డును దాదాపు నాలుగు నిమిషాల్లో బ్రేక్ చేసింది. అలాగే 50-మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌ను ఐదంటే ఐదు సెకన్లలో ఛేదించి వాహ్వా అనిపించుకుంది. ‘‘నేను రేసులో ఉంటే ఇక దేన్నీ పట్టించుకోను. ఐ ఫీల్ లైక్ ఎ ఉమెన్!'‘ అని చెప్పిందామె. (Oyster Mushrooms: బెనిఫిట్స్ తెలిస్తే.. అస్సలు వదలరు!) బ్రస్సెల్ 60 సంవత్సరాల వయస్సు నుండి మాత్రమే స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొంటూ ఉండటం విశేషం. కానీ ఇటీవలి అనేక ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టిన ఘనతను దక్కించుకుంది. ‘‘అమ్మా నీకు ముసలి తనం వచ్చేసిందని నా 70 ఏళ్ల చిన్న కొడుకుఅంటూ ఉంటాడు. కానీ నాకు అలా అనిపించదు. నిజంగా అలసి పోయినప్పుడు మాత్రం కొంచెం అనిపిస్తుంది. అంతే’’ అంటారామె. అలాగే రికార్డుల గురించి కూడా ఆలోచించను. చేయాల్సిన పనిని ధైర్యంగా చేసేస్తాను. గెలిస్తే సంతోషిస్తాను అంటుంది బోసి నవ్వులతో. బ్రస్సెల్స్ ఇప్పటికీ కనీసం వారానికి రెండుసార్లు స్విమ్మింగ్ చేస్తుంది. -
97 ఏళ్ల వయసులో రెక్కలు కట్టుకుని...!
ఆసక్తి , పట్టుదల ఉండాలే గానీ వయసుతో పనేముంది. ఒక్కసారి మనసులో గట్టిగా అనుకుంటే చాలు.. ఎంత రిస్క్ అయినా చేయొచ్చు. బోలెడంత ఆనందాన్ని సొంతం చేసుకోవచ్చు. 97ఏళ్ల వయసులో ఈ పెద్దావిడ సాహసం, తెగువ చూస్తే మీరు కూడా ఇలాగే అనుకుంటారు. ఈ బామ్మకు సెల్యూట్ చేయకుండా ఉండరు! అందుకే పారిశ్రామికవేత్త, ఎంఅండ్ఎం అధినేత ఆనంద్ మహీంద్రను కూడా బామ్మ బాగా ఆకట్టుకుంది. ఆమే నా హీరో అంటూ ఈ వీడియోను ట్విట్ చేశారు. దీంతో నెటిజన్లు బామ్మపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. పువ్వులా నేనే...నవ్వుకోవాలి....గాలినే నేనై... సాగిపోవాలి చిన్నిచిన్నిఆశ.. అంటూ సాగే తమిళ బ్యాగ్ గ్రౌండ్ పాటతో ఈ వీడియో మరింత హృద్యంగా నిలిచింది. అనుకున్న పని సాధించాలంటే వయసుతో పని ఏముంది సార్..అని ఒకరు, అద్భుతమైన వీడియో, బామ్మకు అభినందనలు మరికొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఫ్లయింగ్ రైనో పారామోటరింగ్ అనే ఇన్‌స్టా పేజ్ ఈ వీడియోను ఇటీవల షేర్ చేసింది. 97 ఏళ్ళ వయసులో ఎగిరే ప్రయత్నం చేసిన, సక్సెస్ అయిన ఈ బామ్మ ధైర్యానికి సెల్యూట్ అని పేర్కొంది. మహారాష్ట్ర జెజురి పట్టణంలోని కొండపై ఉన్న ఖండోబా ఆలయం సమీపంలో ఈ ఫీట్ చేశారు బామ్మ. It’s NEVER too late to fly. She’s my hero of the day… pic.twitter.com/qjskoIaUt3— anand mahindra (@anandmahindra) November 23, 2023 -
వికారాబాద్: అవ్వ మిస్సింగ్, చివరకు..
సాక్షి, వికారాబాద్: ఆ అవ్వ ఆయుష్షు గట్టిదే. ప్రమాదవశాత్తూ ఓ పెద్ద కాలువలో పడినా.. రోజంతా అక్కడే గడిపి క్షేమంగా ప్రాణాలతో బయటపడింది. వికారాబాద్ తాండూరు మున్సిపల్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. తాండూర్ మున్సిపల్ పరిధిలోని గీతా మందిర్ సాయిపూర్ ప్రాంతానికి చెందిన కోస్గి భారతమ్మ (75) ఆదివారం మధ్యాహ్నాం నుంచి కనిపించకుండా పోయింది. దీంతో ఆమె మనవడు పట్టణంలో అంతా వెతికాడు. బస్టాండ్, రైల్వే స్టేషన్ అంతా గాలించాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఈ ఉదయం ఇంటి దగ్గర్లో ఉన్న ఓ మురుగు కాలువపై అతనికి అనుమానం వచ్చింది. రోడ్డు వెడల్పు కోసం చేపట్టిన నిర్మాణం అది. వెంటనే మున్సిపల్ పారిశుద్ధ కార్మికులను పిలిపించి అందులో వెతికించాడు. సోమవారం సాయంత్రం పెద్ద నాలాలో కింద మూలుగుతూ కూర్చున్న భారతమ్మ అతని మనవడికి కనిపించింది. మున్సిపల్ కార్మికుల సాయంతో ఆమెను బయటకు తీసుకొచ్చి. దగ్గర్లోనే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు ప్రకటించగా.. ఆమె ప్రమాదవశాత్తు అందులో పడిందని మనవడు చెబుతున్నాడు. మరోవైపు.. అవ్వ మిస్సింగ్ కథ సుఖాంతం కావడంతో మృత్యువును జయించిదంటూ స్థానికులు ఈ విషయాన్ని చర్చించుకుంటున్నారు. -
హైదరాబాద్‌లో మరో హిట్ అండ్ రన్ కేసు
సాక్షి, హైదరాబాద్: నగరంలో మరో హిట్ అండ్ రన్ కేసు నమోదు అయ్యింది. అంబర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కారు.. వృద్ధురాలు ఢీ కొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందగా.. కారు అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయింది. అంబర్పేట్ నుంచి ఉప్పల్ వెళ్లే రోడ్డులో.. కింగ్ ప్యాలెస్ హోటల్ వద్ద బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. మృతురాలిని వినాయక్‌నగర్‌కు చెందిన ముత్యాలమ్మగా పోలీసులు గుర్తించారు. చెత్త పడేయడానికి వెళ్లి ఆమె ప్రమాదానికి గురైనట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. కేసు నమోదు చేసుకున్న అంబర్‌పేట పోలీసులు.. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇదీ చదవండి: మొదటి భార్య ఫిర్యాదుతో శవం వెలికితీత
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
సాక్షి కార్టూన్ 02-05-2024
Lok sabha elections 2024: ఓటేస్తే డైమండ్ రింగ్
Pallavi Dempo: సంపన్న పల్లవి..రాజకీయ వంట కుదిరేనా!
దీనికి జవాబు లేదా బాబూ?
ప్రభుత్వ ఉద్యోగులతో మరో మాట!
సత్యానికి సవాల్!
సీఎస్కేకు బిగ్ షాకిచ్చిన పంజాబ్.. 7 వికెట్ల తేడాతో ఘన విజయం
చరిత్ర సృష్టించిన రుతురాజ్.. ధోని ఆల్‌టైమ్ రికార్డు బద్దలు
నేహా కుటుంబానికి అండగా అమిత్‌షా..
ఆ టాలీవుడ్ హీరోతో కలిసి పని చేయాలని ఉంది: అల్లరి నరేశ్
తప్పక చదవండి
- సీఎం రేవంత్‌పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
- కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్ విషాద మరణాలు (ఫొటోలు)
- రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో పీరియాడికల్ చిత్రం!
- కేసీఆర్‌పై ఈసీ చర్యలు, ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం
- తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న భారీ బడ్జెట్ వెబ్ సిరీస్..!
- నా కుమారుడు వరల్డ్‌కప్ జట్టుకు ఎంపికవుతాడని స్వీట్లు, టపాసులు తెచ్చా: రింకూ తండ్రి ఆవేదన
- సుల్తాన్పూర్ లోక్‌సభ స్థానానికి మేనకా గాంధీ నామినేషన్ దాఖలు
- ‘దిశ’ ఎన్కౌంటర్ కేసు.. సిర్పూర్ కర్ కమిషన్ రిపోర్ట్‌పై స్టే
- జనసేన నేతలకు అవమానం.. టీడీపీ ప్రచార రథంపై నుంచి గెంటేసి..
- రాయ్‌బరేలీ, అమేథి స్థానాలపై 24 గంటల్లో తుది నిర్ణయం
Advertisement