ఫేస్‌బుక్‌లో ప్రేమ..

3 Aug, 2020 07:22 IST|Sakshi

ఆపై సహజీవనం పెళ్లిచేసుకోమంటే తనకు 

ఇదివరకే పెళ్లైందని తేల్చిచెప్పిన యువకుడు 

ఆర్‌జీఐఏ పోలీసులను ఆశ్రయించిన యువతి 

శంషాబాద్‌: ఫేస్‌బుక్‌ పరిచయం ప్రేమగా మారింది.. ఆపై ఇద్దరు సహజీవనం చేశారు.. తీరా యువతి పెళ్లి చేసుకోమనగానే సదరు యువకుడు తనకు ఇంతకు మునేపే పెళ్లి జరిగిందని యువతితో చెప్పడంతో ఖంగుతిన్న సదరు యువతి ఆర్‌జీఐఏ పోలీసులను ఆశ్రయించింది. ఆర్‌జీఐఏ సీఐ విజయ్‌కుమార్‌ తెలిపిన వివారలు ఇలా ఉన్నాయి.. నగరంలోని కుషాయిగూడ చక్రిపురం కాలనీకి చెందిన యువతి 23 (డ్యాన్సర్‌) మండలంలోని బహదూర్‌గూడకు చెందిన రాజ్‌కుమార్‌ (25)కి ఏడాదిన్నర కిందట ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది.

పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో ఎనిమిది నెలల కిందట పట్టణంలోని ఆర్‌బీనగర్‌లో భార్యభర్తలుగా చెప్పుకుంటూ ఓ అద్దెగదిలో నివాసముంటూ సహజీవనం చేశారు. ఇటీవల ఇద్దరి మధ్యన మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. యువతి తనను వివాహం చేసుకోవాల్సిందిగా రాజ్‌కుమార్‌ను కోరడంతో తనకు అప్పటికే పెళ్లి జరిగిందని తేల్చిచెప్పడంతో పాటు సదరు యువతిని పెళ్లి చేసుకోనని చెప్పడంతో మోసపోయినట్లుగా గుర్తించిన యువతి ఆదివారం ఆర్‌జీఐఏ పోలీసులను ఆశ్రయించింది. తనను నమ్మించి మోసం చేశాడని వాపోయింది. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాజ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.   

మరిన్ని వార్తలు