లక్కీ డ్రా గ్యాంగ్‌..ఇలా చిక్కారు!‌

17 Mar, 2021 20:44 IST|Sakshi

జగిత్యాలక్రైం: లక్కీ లాటరీ పేరుతో సామాన్యులకు సభ్యత్వం ఇస్తూ ప్రతీనెల వాయిదాల పద్ధతిలో డబ్బు తీసుకుని డ్రా నిర్వహిస్తూ లక్షలాది రూపాయలు వసూలు చేస్తుండగా జగిత్యాల రూరల్‌ ఎస్సై చిరంజీవి, జగిత్యాల అర్బన్‌ మండలం మోతె గ్రామంలో సోమవారం దాడి చేసి 13 మందిపై కేసు నమోదు చేశారు. మోతె గ్రామానికి చెందిన లోకిని చంద్రమౌళి, చైత్రిక ఎంటర్‌ప్రైజెస్‌ పేరుతో లక్కీ డ్రా దందా నిర్వహిస్తున్నాడు. అంతే కాకుండా మరో 12 మంది ఆరె ధర్మయ్య, ప్రదీప్, బొల్లం కిరణ్, నర్ర శేఖర్, నాంపల్లి పవన్, చిలుక సతీశ్, నాయిని రాజన్న, వేముల రమేశ్, సతీశ్, రాకేశ్, కొక్కు సందీప్, సామల్ల చందు ఏజెంట్లుగా పని చేస్తున్నారు.

 ఒక్కో సభ్యుడి నుంచి వారానికి రూ.300 వసూలు చేసి లక్కీ డ్రా నిర్వహిస్తూ పెద్దఎత్తున సొమ్ము చేసుకుంటున్నారు. వీరిని అరెస్ట్‌ చేసి వీరి వద్ద నుంచి రూ.2.07 లక్షల నగదు, ఆరు రిసీప్ట్‌ బుక్స్, చైత్రిక ఎంటర్‌ప్రైజెస్‌ బుక్‌లెట్స్‌ 130, లాటరీ కాయిన్స్‌ 45, లాటరీ కాయిన్స్‌ రోలింగ్, ప్లాస్టిక్‌ కుర్చీలు 70, టెంట్‌ 1, టేబుల్‌ ఫ్యాన్స్‌ 22, పెడెస్టెల్‌ ఫ్యాన్స్‌ 2, మిక్చర్‌ గ్రైండర్స్‌ 25, గ్యాస్‌స్టౌవ్‌ 4 స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేసినట్లు రూరల్‌ ఎస్సై తెలిపారు. 

మరిన్ని వార్తలు