సిక్కులపై  అభ్యంతరకరమైన వ్యాఖ్యలు.. నటి కంగనాపై కేసు నమోదు

24 Nov, 2021 11:11 IST|Sakshi

ముంబై: సిక్కులపై సామాజిక మాధ్యమంలో అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌పై పోలీసు కేసు నమోదైంది. సబ్‌ అర్బన్‌ ఖార్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఢిల్లీ సిక్‌ గురుద్వారా మేనేజ్‌మెంట్‌ కమిటీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు సోమవారం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. రైతు ఉద్యమాన్ని  ఉద్దేశపూర్వకంగానే ‘ఖలిస్తాన్‌’ఉద్యమం అని, సిక్కులను ఖలిస్తానీ టెర్రరిస్టులంటూ వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో కమిటీ సభ్యులు పేర్కొన్నారు. 1984లో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లు, అప్పటి ప్రధాని ఇందిరా గాంధీపై తన పోస్టులో అనుచిత వ్యాఖ్యలు చేశారని తెలిపారు.
చదవండి: నాన్నగారు కోలుకుంటున్నారు, వదంతులు నమ్మవద్దు: కైకాల సత్యనారాయణ కుమార్తె

మరిన్ని వార్తలు