దారి దోపిడీ ముఠా అరెస్ట్‌ 

23 Sep, 2022 09:05 IST|Sakshi
నిందితులను అరెస్టు చూపుతున్న డీఎస్సీ రమ్య

పెనుకొండ: చిల్లర ఖర్చులకు దారి దోపిడీలకు పాల్పడుతున్న ముఠాను గురువారం అరెస్ట్‌ చేసినట్లు పెనుకొండ డీఎస్పీ రమ్య తెలిపారు. గురువారం పెనుకొండ పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను ఆమె వెల్లడించారు. రొద్దం మండలానికి చెందిన కురుబ శబరీష్‌ ప్రస్తుతం పరిగిలో ఉంటున్నాడు. హిందూపురం రూరల్‌ కొట్నూరుకు చెందిన భరత సింహారెడ్డి, మరో మైనర్‌ బాలునితో కలసి రాత్రి వేళ, తెల్లవారుజాము సమయాల్లో  44వ జాతీయ రహదారిపై నిలిపి ఉన్న వాహనాల డ్రైవర్లను కత్తితో బెదిరించి, సెల్‌ఫోన్లు, నగదు అపహరించుకెళ్లేవారు.

ఈ ఏడాది జూలై 8న అనంతపురం జిల్లా రాప్తాడు, కియా, సోమందేపల్లి పోలీస్‌స్టేషన్ల పరిధిలో వరుస దోపిడీలు సాగించారు. ఈ ఘటనలపై కేసులు నమోదు చేసిన పోలీసులు సీఐ కరుణాకర్, కియా ఎస్‌ఐ వెంకటరమణ, సోమందేపల్లి ఎస్‌ఐ విజయకుమార్‌ నేతృత్వంలో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దుండగుల కోసం గాలింపు చేపట్టారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కురుబ శబరీష్‌, భరతసింహారెడ్డి, మరో మైనర్‌ బాలుడు చోరీలకు పాల్పడినట్లుగా గుర్తించి, గురువారం నిందితులను అరెస్ట్‌ చేశారు.

వీరి నుంచి ఏడు సెల్‌ఫోన్లు, పల్సర్‌బైక్, కత్తి స్వాధీనం చేసుకున్నారు. శబరీష్‌, భరతసింహారెడ్డిని న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. బాలుడిని జువైనల్‌ హోంకు తరలించారు. నిందితుల అరెస్ట్‌లో చొరవ చూపిన సిబ్బందికి ఉన్నతాధికారులు రివార్డు ప్రకటించారు. సమావేశంలో సీఐ కరుణాకర్, ఎస్‌ఐలు రమే‹Ùబాబు, వెంకటరమణ, విజయకుమార్, సిబ్బంది పాల్గొన్నారు.   

(చదవండి: పరిటాల శ్రీరామ్‌ మా తండ్రిని హత్య చేయించింది మీరు కాదా?)

మరిన్ని వార్తలు