బాలిక సూసైడ్‌ నోట్‌.. కుటుంబంలో కలకలం

25 Feb, 2021 13:18 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ముంబై : ఇంట్లోని వ్యక్తి తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడన్న సంగతి ఎవరికీ చెప్పలేక ఓ బాలిక నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య చేసుకుంది. బాలిక రాసిన సూసైడ్‌ నోట్‌ ఆ కుటుంబంలో కలకలం సృష్టించింది. ఈ సంఘటన మహారాష్ట్రలోని ముంబైలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సోమవారం ముంబై, మల్వానికి చెందిన 14 ఏళ్ల బాలిక నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య చేసుకుంది. బాలిక తల్లికి సంఘటనా స్థలంలో ఓ సూసైడ్‌ నోట్‌ లభించింది. అది చదివని ఆమె దాన్ని నమిలి మింగేసింది. అనంతరం పోలీసులకు ఆత్మహత్య విషయం తెలిసింది. అక్కడికి చేరుకున్న పోలీసులకు సూసైడ్‌నోట్‌కు సంబంధించిన స్క్రీన్‌ షాట్‌లు లభించాయి.

ఆ సూసైడ్‌ నోట్‌లో.. ‘నాన్న నువ్వు నన్ను కూతురిలా భావించలేదు. ఇంకో విధంగా భావించావు. నువ్వు నాకు చేసిన దాన్ని ఎవ్వరికీ చెప్పలేదు. నేను దాన్ని తట్టుకోలేకపోతున్నాను. అందుకే చచ్చిపోతున్నా’ అని సూసైడ్‌ నోట్లో‌ పేర్కొంది. ఆత్మహత్యకు ముందు దీన్ని స్క్రీన్‌ షాట్‌ తీసి స్నేహితులకు, బంధువులకు పంపింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతురాలి పినతండ్రి తల్లి మూడో భర్త అని విచారణలో తేలింది. హాస్టల్‌లో ఉంటున్న బాలిక లాక్‌డౌన్‌ సమయంలో ఇంటికి వచ్చింది. ఫిబ్రవరి 21వ తేదీన ఇంట్లో ఎవరూ లేని సమయంలో నిందితుడు బాలికపై లైంగిక దాడికి పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. 

చదవండి : బీఎస్‌ఎఫ్‌ జవాన్లకు తృటిలో తప్పిన పెను ప్రమాదం

రూ.100కు ఓటీపీ.. వివాహితకు వేధింపులు
 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు