రూ.4.55 కోట్ల బంగారం పట్టివేత 

28 Oct, 2023 02:53 IST|Sakshi

హైదరాబాద్‌లో రూ.2.56 కోట్ల నగదు సీజ్‌

జహీరాబాద్‌/సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర సరిహద్దులో నిర్వహించిన వాహనాల తనిఖీల్లో సరైన పత్రాలు లేకుండా తరలిస్తున్న బంగారాన్ని పట్టుకున్నట్లు చిరాగ్‌పల్లి ఎస్‌ఐ నరేష్‌ తెలిపారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం మాడ్గి గ్రామ శివారులో 65వ జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన సరిహద్దు చెక్‌ పోస్టు వద్ద కేంద్ర బలగాలతో కలిసి పోలీసులు తనిఖీలు చేపట్టారు.

గుజరాత్‌ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న స్కార్పియో వాహనంలో 6,986 గ్రాముల బంగారు నగలను స్వాదీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.4.55 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. మరోవైపు, హైదరాబాద్‌లో శుక్రవారం చేసిన తనిఖీల్లో రూ. 2,56,84,671 నగదును సీజ్‌ చేసినట్లు హైదరాబాద్‌ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్‌ రోస్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

మరిన్ని వార్తలు