కాబోయే భార్యపై పెట్రోల్‌ దాడి.. ముగ్గురికి తీవ్ర గాయాలు

20 Aug, 2021 11:14 IST|Sakshi

విజయనగరం: విజయనగరం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పూసపాటిరేగ మండలం చౌడువాడ గ్రామంలో కాబోయే భార్యపై పెట్రోల్‌ పోసి నిప్పంటిచాడో ప్రబుద్ధుడు. ఈ క్రమంలో. ఆ యువకుడిని బాధితురాలి సోదరి అడ్డుకోవడానికి ప్రయత్నించింది.

దీంతో వారిద్దరి మధ్య తోపులాట జరిగింది. కాగా, మంటల కారణంగా.. బాధితురాలి సోదరితోపాటు, ఆమె కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గాయపడ్డ ముగ్గురినీ సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కాగా, రాంబాబు అనే వ్యక్తి దాడికి పాల్పడినట్టు పోలీసులు నిర్ధారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు