శ్రీకాళహస్తిలో దారుణం.. సీసీ కెమెరాలో దృశ్యాలు..

9 Sep, 2021 12:22 IST|Sakshi

సాక్షి, చిత్తూరు జిల్లా: శ్రీకాళహస్తిలో దారుణం చోటుచేసుకుంది. ఇనుపరాడ్లతో యువకుడిని దుండగులు దారుణంగా కొట్టారు. తీవ్ర గాయాలపాలైన ఆ వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడిని ఇమ్రాన్‌ (27)గా పోలీసులు గుర్తించారు. గతంలో అనేకమందితో ఇమ్రాన్ గొడవలు పెట్టుకున్నట్టు తెలుస్తోంది. పాత కక్షల నేపథ్యంలో హత్య జరిగిన ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దాడి దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్‌ అయ్యాయి. హతమార్చిందెవరనే దానిపై సీసీ ఫుటేజీల ఆధారంగా పోలీసులు విచారిస్తున్నారు.

చదవండి:
శునకం నోటిలో పసికందు తల 
టిఫిన్‌ హోటల్‌కు రూ.21 కోట్ల కరెంటు బిల్లు 

మరిన్ని వార్తలు