హాపూర్‌ ఘటన.. పోలీసులు వచ్చేలోపు పరార్‌

12 Aug, 2020 15:07 IST|Sakshi

లక్నో: ఆరేళ్ల బాలికను కిడ్నాప్‌ చేసి అ‍త్యంత అమానుషంగా అత్యాచారానికి పాల్పడిన ఘటనలో పోలీసులు మృగాళ్ల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. వారి ఊహా చిత్రాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బాలికపై దారుణానికి ఒడిగట్టిన వారిలో ఓ వ్యక్తి అమ్రోహాలోని తన సొంత గ్రామ శివార్లలో చేతిలో మద్యం బాటిళ్లతో తిరుగుతుండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే వారు వచ్చేలోపే నిందితుడు తప్పించుకున్నాడు. స్థానికులు నిందితుడిని దల్పత్‌గా గుర్తించారు. అతడు అమ్రోహాలోని గజ్రౌలా ప్రాంతం మహమూద్‌పూర్‌ గ్రామంలో నివసిస్తున్నాడు. దాంతో పోలీసులు అతడి ఇంటిని చుట్టుముట్టారు. గత ఆరు రోజులుగా పోలీసులు అనేక బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం అమ్రోహాలోని గజ్రౌలా సమీపంలోని అటవి ప్రాంతంలో తీవ్రంగా గాలిస్తున్నారు. సోమవారం స్థానికులు నిందితులను గుర్తించి పోలీసులకు తెలిపారు. కానీ వారు వచ్చేలోపే నిందితులు తప్పించుకున్నారు. (బాలికపై అత్యాచారం: నిందితుల ఊహా చిత్రాలు!)

ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ జిల్లాలో పోయిన గురువారం ఆరేళ్ల బాలిక ఇంటి ముందు ఆడుకుంటుండగా బైక్‌పై  వచ్చిన ఓ వ్యక్తి  బాలికను కిడ్నాప్ చేసి తీసుకెళ్లి స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీని గురించి బాలిక తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈలోపు శుక్రవారం ఉదయం పొలాల్లో ఒంటిపై తీవ్ర గాయాలతో బాలిక అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని స్థానికులు కనుగొన్నారు. అనంతరం ఆమెను మీరట్‌లోని ఆస్పత్రికి తరలించగా బాలికపై అత్యాచారం జరిగినట్లు వైద్యులు నిర్దారించారు. బాలిక పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని.. నాటి భయానక సంఘటన నుంచి చిన్నారికి ఇంకా కోలుకోలేదని వైద్యులు తెలిపారు. 

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు