మియాపూర్‌లోని ఫ్లాట్‌లో సీక్రెట్‌గా హైటెక్‌ వ్యభిచారం.. పోలీసుల ఎంట్రీతో..

13 May, 2022 18:35 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని మియాపూర్‌లో హైటెక్‌ సెక్స్‌ రాకెట్‌ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ రైడ్‌లో ఇద్దరు నిర్వాహకులతో పాటు ఓ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వివరాల ప్రకారం.. మియాపూర్‌ గోకుల్‌ ప్లాట్స్‌లో ఉన్న సాయిరాం రెసిడెన్సీలోని ఫ్లాట్‌ నెంబర్‌ 1205లో గుట్టుగా హైటెక్‌ వ్యభిచారం నడుస్తోంది. ఒంగోలుకు చెందిన షైక్ ఇర్ఫాన్(26), సాయి గణేష్ రెడ్డి(27)లు.. మహిళలతో వ్యభిచార వ్యవహారం నడుపుతున్నారు. కాగా, ఫ్లాట్‌లో వ్యభిచారం నడిపిస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు శుక్రవారం రైడ్స్‌ వెళ్లారు. దాడుల్లో భాగంగా ఇద్దరు నిర్వాహాకులను అదుపలోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. 

ఈ దాడుల్లో అదుపులోకి తీసుకున్న ఓ మహిళను రెస్క్యూ హోమ్‌కు తరలించారు. వ్యభిచారం నిర్వహణపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. 

ఇది కూడా చదవండి: న్యూడ్‌ కాల్స్‌తో పెళ్లి చేసుకోవాలని బ్లాక్‌ మెయిల్‌.. ప్రియుడ్ని హత్య చేసి యాక్సిడెంట్‌గా డ్రామా

మరిన్ని వార్తలు