వివాహేతర సంబంధం: ఆఫీస్‌లో పరిచయం.. భార్యకి తరచూ ఫోన్‌ చేస్తున్నాడని..

6 Sep, 2022 15:52 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

తిరువొత్తియూరు: కోవైలోని ఓ వివాహితతో సెల్‌ఫోన్‌లో తరచూ మాట్లాడుతున్నాడనే ఆగ్రహంతో ఓ ఫైనాన్స్‌ సంస్థ మేనేజర్‌ను ఆమె భర్త, అతడి స్నేహితులు కిడ్నాప్‌ చేసి దాడి చేశారు. కత్తితో పొడిచిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. మదురై అలంగానల్లూర్‌కు చెందిన సోన ముత్తు (37). ఇతనికి వివాహమై భార్య, ఓ కుమారుడు ఉన్నాడు. సోనముత్తు కోవై అవినాశి రోడ్డులోని ఓ ప్రైవేటు బ్యాంకులో పని చేస్తున్నాడు. ఆ సమయంలో అదే బ్యాంకులో సేల్స్‌ విభాగంలో పని చేస్తున్న యువతితో పరిచయం ఏర్పడింది.  తర్వాత సోనముత్తు రామనాథపురం నంజుండాపురం శ్రీపతినగర్‌లో ఓ ప్రైవేటు ఫైనాన్స్‌ సంస్థలో పని చేస్తున్నాడు.

ఈక్రమంలో ఆ యువతికి వివాహమైంది. అయినప్పటికీ సోనముత్తు ఆ యువతికి తరచూ ఫోన్‌ చేస్తున్నట్లు సమాచారం. దీంతో సోనముత్తును కారులో కిడ్నాప్‌ చేసిన ఆ యువతి భర్త సాల్మన్‌ పారిస్‌ (23), అతని మిత్రులు అక్బర్‌ సాధిక్‌ (24), ముహ్మద్‌ అన్సర్‌ (24) తర్వాత కత్తితో పొడిచారు. దీంతో సోనముత్తును స్థానికులు చికిత్స కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దీనికి సంబంధించి రేస్‌కోర్స్‌ పోలీసులు కేసు నమోదు చేసి సాల్మన్‌ పారిస్, అక్బర్‌ సాధిక్, మహమ్మద్‌ అన్సర్‌ను అరెస్టు చేశారు.

చదవండి: ఎంత పనైపాయే.. స్కెచ్‌ ఒకరికి.. మర్డర్‌ మరొకరిని..

మరిన్ని వార్తలు