వెంటపడి వేధించి నాలుగేళ్ల క్రితం పెళ్లి.. మాంసం వండాలని ఒత్తిడి, చివరకు

16 Mar, 2022 08:49 IST|Sakshi

హుబ్లీ: బ్లాక్‌మెయిల్‌ చేసి వివాహం చేసుకొని మతం మార్పించి వేధించడంతోపాటు మచ్చుకత్తితో నరికిన కిరాతక భర్త నుంచి తన ప్రాణాలకు ముప్పు ఉందని గదగ్‌కు చెందిన అపూర్వ పురాణిక్‌ అనే మహిళ మంగళవారం మీడియాతో మొరపెట్టుకుంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే భర్త వేధింపులను ఏకరవు పెట్టింది.

ఆమె మాటల్లోనే.. నిత్యం కాలేజీకి హిజాజ్‌ అనే వ్యక్తి ఆటోలో వెళ్తుండేదాన్ని. ఈ క్రమంలో తనను శారీకంగా వేధించి ఆ దృశ్యాలను వీడియో తీసి  నా తల్లిదండ్రులకు చూపెడతానని బెదిరించి 2018లో పెళ్లి చేసుకున్నాడు. ఆపై  విజయపుర తీసుకెళ్లి రాక్షసంగా వ్యవహరించాడు. మత మార్పిడి చేసుకుంటేనే కాపురం చేస్తానని బెదిరించి మతం మార్పించాడు. మాంసాహారం వండాలని, తానూ తినాలని ఒత్తిడి చేసేవాడు. కొడుకు పుట్టగా అతనికి మాంసం తినిపించేవాడు. నన్ను హిప్నటైజ్‌ చేశాడు.

అతను చెప్పినట్లే నడుచుకునే దాన్ని. అతడికి ఇప్పటికే వివాహమై ముగ్గురు పిల్లలు ఉన్నట్లు తెలిసింది.  వేధింపులు తాళలేక పుట్టింటికి వెళ్లా. ఈనెల 12న గదగ్‌కు వచ్చి మాట్లాడుదామని చెప్పి పిలుచుకొని వచ్చి మచ్చుకత్తితో 23 సార్లు నరికాడు. అతని వల్ల తనకు, తన బిడ్డ ప్రాణాలకు ముప్పు ఉందని ఆందోళన  వ్యక్తం చేసింది.     

మరిన్ని వార్తలు