యువతి ఒంటరిగా ఉన్నప్పుడు సీక్రెట్‌గా వీడియో తీసి..

29 May, 2021 13:41 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హిమాయత్‌నగర్‌: తనను సీక్రెట్‌గా వీడియో తీసి తన స్నేహితులు కొద్దిరోజులుగా బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నారని నగరానికి చెందిన ఓ యువతి శుక్రవారం సైబర్‌ క్రైం పోలీసులకు ఆన్‌లైన్‌ ద్వారా ఫిర్యాదు చేసింది. యువతి ఒంటరిగా ఇంట్లో ఉన్నప్పుడు (అసభ్యకర రీతిలో) సీక్రెట్‌గా వీడియో తీసి ఆ వీడియోను సోషల్‌ మీడియా పోస్ట్‌ చేశారు. అనంతరం తనను బ్లాక్‌ మెయిల్‌ చేస్తూ వేధింపులకు గురి చేస్తున్నారు. సంబంధిత వ్యక్తులకు ఫోన్‌ చేస్తే కూడా లిఫ్ట్‌ చేయకుండా ఇబ్బంది పెడుతున్నారని యువతి ఆరోపించింది.  

మరిన్ని వార్తలు