అలాంటి సీన్లు ఉన్నాయ్‌.. బేబీ సినిమాపై సీపీ సీవీ ఆనంద్‌ సీరియస్‌

14 Sep, 2023 17:45 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టాలీవుడ్‌లో సంచలనాలకు నెలవైన బేబీ సినిమాపై నగర పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ ఫైర్‌ అయ్యారు. సినిమా డ్రగ్స్‌ కల్చర్‌ను ప్రొత్సహించేలా ఉందంటూ మండిపడ్డారాయన. 

సినిమాలో డ్రగ్స్‌ను ప్రొత్సహించేలా సన్నివేశాలు ఉన్నాయి. ఫ్రెష్‌ లివింగ్‌ అపార్ట్‌మెంట్‌లో రైడ్‌లు నిర్వహించినప్పుడు.. బేబీ సినిమాలోని సీన్లలాంటివి కనిపించాయి. ఆ సినిమాను చూసే నిందితులు అలా పార్టీ చేసుకున్నారు. సినిమాల్లో అలాంటి సన్నివేశాలు పెట్టినప్పుడు.. కనీస హెచ్చరిక(కింద మూలన వేసే ప్రకటన) కూడా వెయ్యికుండా డైరెక్ట్ ప్లే చేశారు. ( బేబీ చిత్రంలోని అభ్యంతరకర సీన్లుగా చెబుతున్నవాటిని మీడియాకు ప్లే చేసి చూపించారాయన).

మళ్లీ మేం హెచ్చరిస్తేనే హెచ్చరిక వేశారు. ఇందుకుగానూ.. బేబీ సినిమా టీంకు నోటీసులు జారీ చేస్తాం అని సీపీ సీవీ ఆనంద్‌ తెలిపారు.  ఇక నుంచి ప్రతీ సినిమాపై నిఘా వేస్తామని.. అభ్యంతరకర సన్నివేశాలు ఉంటే ఊరుకునేది లేదని నగర సీపీ స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు