హైదరాబాద్‌ పోలీస్‌.. టార్గెట్‌ న్యూ ఇయర్‌ పార్టీస్‌!

16 Dec, 2021 15:41 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో: డిసెంబర్‌ 31 రాత్రి జరగనున్న న్యూ ఇయర్‌ వేడుకలను టార్గెట్‌గా చేసుకున్న డ్రగ్‌ పెడ్లర్లు దందా వేగం పెంచారు. గంజాయికి బదులుగా దాని కంటే తేలిగ్గా రవాణా చేయగలిగే హష్‌ ఆయిల్‌పై దృష్టి పెట్టారు. దీనిని గమనించిన నగర పోలీసు విభాగం నిఘా ముమ్మరం చేసింది. ఫలితంగా నగర టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ముగ్గురిని పట్టుకుని, రూ.25 లక్షల విలువైన 3.5 లీటర్ల ఆయిల్‌ స్వాధీనం చేసుకున్నట్లు నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ తెలిపారు. ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావు, డీసీపీ చక్రవర్తి గుమ్మిలతో కలిసి బుధవారం  విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.  

► విశాఖపట్నం జిల్లా, పాయకరావుపేటకు చెందిన సంపతి కిరణ్‌కుమార్‌ ఐటీఐ పూర్తి చేశాడు. ఆపై విజయవాడ, కాకినాడల్లో ఉద్యోగాలు చేసినా నిలదొక్కుకోలేదు. పాడేరు ఏజెన్సీకి చెందిన గంజాయి విక్రేతలతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. 
► గత ఏడాది మేలో గంజాయి రవాణా చేస్తూ తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం పోలీసులకు చిక్కాడు. మూడు నెలలకు బెయిల్‌పై బయటకు వచ్చిన ఇతగాడు నగరానికి వచ్చి మణికొండ ప్రాంతంలో నివసిస్తున్నాడు. 

► గత కొద్ది కాలంగా పోలీసులు గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నారు. దీంతో రవాణా చేĶæడానికి అనువుగా మారిన హష్‌ ఆయిల్‌పై ఇతడి దృష్టి పడింది. ఈ నేపథ్యంలో పాడేరు ప్రాంతానికి చెందిన వినోద్‌తో పరిచయం పెంచుకున్నాడు. 
► వినోద్‌ స్థానికంగా లభించే గంజాయి మొక్కలతో ఈ ఆయిల్‌ తయారు చేస్తున్నాడు. అక్కడ తక్కువ రేటుకు 1.5 లీటర్లు ఖరీదు చేసిన కిరణ్‌ ట్రావెల్స్‌ బస్సులో సిటీకి తెచ్చాడు. విక్రయించడానికి ప్రయత్నిస్తూ గోల్కొండ వద్ద టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు చిక్కాడు. 
► జహనుమ, యాప్రాల్‌ ప్రాంతాలకు చెందిన మహ్మద్‌ ఇర్ఫాన్, షేక్‌ కమల్‌ దూరపు బంధువులు. చిన్న చిన్న పనులు చేసే వీరు  తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం అక్రమ మార్గం పట్టారు. పాడేరుకు చెందిన గౌతమ్‌ నుంచి హష్‌ ఆయిల్‌ కొంటున్నారు. 

► తొలినాళ్లల్లో వీళ్లే వినియోగించే వారు. అయితే న్యూ ఇయర్‌ పార్టీల నేపథ్యంలో ఈ సరుకు డి మాండ్‌ పెరగడంతో దందా చేయాలని నిర్ణయించుకున్నారు. ఇటీవల సింహాచలం వరకు వెళ్లి గౌతమ్‌ నుంచి 2 లీటర్ల కొని తీసుకువచ్చారు.  
► దీనిని విక్రయించే ప్రయత్నాల్లో ఉండగా సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఫల క్‌నుమ ప్రాంతంలో పట్టుకున్నారు.  వీడ్‌ ఆయిల్‌గానూ పిలిచే దీన్ని ఒక్కో మిల్లీ లీటర్‌ రూ.700 నుంచి రూ.1000 వరకు అమ్ముతున్నారు.  
► న్యూ ఇయర్‌ సీజన్‌లో ఇది రూ.2000కు చేరే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. ఈ పార్టీలపై కన్నేసి ఉంచామని, పబ్‌ ఓనర్లనూ హెచ్చరించామని కొత్వాల్‌ పేర్నొఆ్నరు. తల్లిదండ్రులు సైతం తమ పిల్లలపై కన్నేసి ఉంచాలని సూచించారు.

చదవండి: నవవధువు ఆత్మహత్య: భర్త వేధింపుల వల్లే మా కుమార్తె చనిపోయింది

మరిన్ని వార్తలు