దగ్గరి బంధువులే దోపిడి చేశారు

1 May, 2021 10:33 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌(చాదర్‌ఘాట్‌): వృద్ధురాలిని కత్తితో బెదిరించి దోపిడీ చేసిన కేసు మిస్టరీని చాదర్‌ఘాట్‌ పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. నిందితులను అదుపులోకి తీసుకొని సొత్తును స్వాధీనం చేసుకున్నారు. అప్పులు తీరే దారిలేక సొంత పెద్దమ్మ ఇంట్లోనే భర్తతో కలిసి యువతి దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఇన్‌స్పెక్టర్‌ సతీష్‌ తెలిపిన వివరాలు.. అజంపురా ఉస్మాన్‌పురాలో నివసించే నికారున్నీసా (65) గురువారం ఇఫ్తార్‌ ముగించి భర్త బయటకు వెళ్లటంతో ఇంట్లో ఒంటరిగా ఉంది.

అదే సమయంలో బురఖాలో వచ్చిన ఇద్దరు ఆగంతకులు ఇంట్లోకి చొరబడి ఆమెను కట్టేసి కత్తితో బెదిరించి బీరువాలోని రూ.2 లక్షల నగదు, బంగారు చైను ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే. బాధితురాలి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన చాదర్‌ఘాట్‌ పోలీసులు సీసీ పుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించారు. నికారున్నీసా సోదరి కుమార్తె అజంపురాకు చెందిన సాదివి ఇదాయాత్‌ (32), ఆమె భర్త అక్సర్‌ (43) లను నిందితులుగా గుర్తించారు. దంపతులకు అప్పులు ఎక్కువ కావటంతో దోపిడీకి పాల్పడినట్లు నేరం ఒప్పుకున్నారు. పోలీసులు వారిని అదుపులోనికి తీసుకొని రూ.1.70 లక్షల నగదు, బంగారు చైను స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు.  

( చదవండి: కూకట్‌పల్లిలో కాల్పుల కలకలం..చంపేసి.. దోచేశారు

మరిన్ని వార్తలు