వీసా గడువు ముగిసినా.. డ్రగ్స్‌ పెడ్లర్‌ టోనీ బ్యాగ్రౌండ్‌ ఇదే!

30 Jan, 2022 17:17 IST|Sakshi

హైదరాబాద్‌:  నగరంలో సంచలనం రేకెత్తించిన డ్రగ్స్‌ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న టోనీ ఇంతకాలం పోలీసులకు కళ్లుగప్పి తప్పించుకుని తిరిగాడు. కానీ అతన్ని చివరకు ముంబైలో పట్టుకున్నారు హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు. ఈ క్రమంలోనే అతని బ్యాగ్రౌండ్‌ ఏమిటా అనేది ఆసక్తికరంగా మారింది. టోనీ పూర్తి పేరు చుకువు డేవిడ్ అలియాస్ మార్ష్‌ టోనీ. తండ్రి పేరు అభియా మార్ష టోనీ..తల్లి పేరు రోజ్ మేరీ చుకువు. బర్త్ ప్లేస్ షాగాము విలేజ్, నైజీరియా. అనంతరం నైజీరియాలోని ఒక్ పంక్ విలేజ్‌కి మకాం మార్చాడు..

2013 నుండి బట్టల వ్యాపారం ముసుగులో ముంబైలో డ్రగ్స్ దందాకు తెర లేపిన టోనీ.  ముంబైలోని అంధేరీ ఈస్ట్, చాందీవాలీలలో మిలాన్ కాంప్లెక్స్ లో టోనీ నివసిస్తూ.. ముంబై నుండి షిప్స్‌ ద్వారా డ్రగ్స్‌ను భారత్‌కు దిగుమతి చేసేవాడు.. అలా డ్రగ్స్‌ పెడ్లర్‌గా, డ్రగ్స్‌ డాన్‌గా ఎదిగాడు. వీసా గడువు ముగిసిన కూడా అక్రమంగా ఇండియాలోనే ఉంటూ డ్రగ్స్ బిజినెస్ కొనసాగిస్తున్న టోనీ.. గత 9 ఏళ్లుగా పోలీసులకు చిక్కకుండా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాడు. ముంబై లో టోని కోసం భారీగా ఇన్ఫార్మర్లను పోలీసులు ఏర్పాటు చేయగా, చివరకు హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అతన్ని ముంబైలో అరెస్ట్‌ చేశారు. 

చదవండి: డ్రగ్స్‌ పెడ్లర్‌ టోనీ కేసులో కీలక పరిణామం

మరిన్ని వార్తలు