వ్యభిచార గృహంపై టాస్క్‌ఫోర్స్‌ దాడి

16 Jul, 2021 08:30 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

కరీంనగర్‌క్రైం: కరీంనగర్‌లోని తీగలగుట్టపల్లిలో గల వ్యభిచార గృహంపై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గురువారం దాడి చేశారు. వివరాలు.. కరీంనగర్‌ తీగలగుట్టపల్లిలో సిద్దంశెట్టి నాగరాజు వ్యభిచార గృహం నిర్వహిస్తున్నాడనే సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడి చేశారు. విటుడు శ్రీనివాస్, నిర్వాహకుడు నాగరాజును కరీంనగర్‌రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు.  

గుట్కా పట్టివేత
కరీంనగర్‌క్రైం: కరీంనగర్‌ పరిసర ప్రాంతంలో నిషేధిత గుట్కా అమ్మకాలు జరుపుతున్న వ్యక్తిని కరీంనగర్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. గురువారం కరీంనగర్‌ పట్టణంలోని వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో అనుమానాస్పదంగా తిరుగుతున్న కరీంనగర్‌కు చెందిన ఇంతియాజ్‌ను పట్టుకొని విచారించగా అతడి వద్ద గుట్కా లభించడంతో అరెస్టు చేసి వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అతడి నుంచి రూ.16,100 విలువ గల గుట్కా స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్‌ సీఐలు మల్లయ్య, సృజన్‌రెడ్డి, వన్‌టౌన్‌ సీహెచ్‌ నటేశ్‌ పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు