‘నాకు వేరే దారిలేదు’.. విషం తాగుతూ సెల్ఫీ వీడియో

24 Jul, 2023 15:26 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

హుబ్లీ(బెంగళూరు): గతంలో అప్పు అంటే భయపడేవాళ్లు. కానీ ప్రస్తుత సమాజంలో  అప్పు తీసుకోవడం సర్వ  సాధరాణమైపోయింది. మధ్య తరగతి నుంచి లక్షలు సంపాదించే ఐటీ నిపుణులు కూడా అప్పు తీసుకుంటున్నావారే. అయితే ఇలా అప్పు తీసుకుంటున్న వీరిలో కొంతమంది ఆర్థిక క్రమశిక్షణ లేకుండా ఖర్చు పెడుతూ ఇబ్బందులు పాలవుతుండగా, మరికొందరు ఆరోగ్యం కోసమో, లేదా వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి నష్టపోతున్నారు.

అనంతరం చేసిన అప్పుకు వడ్డీతో కలిపి చెల్లించేందుకు నానాతంటాలు పడుతూ చివరికి ఆత్మహత్య చేసుకుంటూ నూరేళ్లు జీవితానికి మధ్యలో ఫుల్‌స్టాప్‌ పెడుతున్నారు. తాజాగా ఓ వ్యక్తి అప్పులు తీర్చే మార్గం కనిపించక ఓ విషం తాగుతూ సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ధార్వాడ చైతన్య నగరంలో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది.

వివరాలు... చైతన్య నగర లింగరాజ సిద్దప్పన్నవర (36) ఓ వ్యక్తి వద్ద రూ. 10 లక్షలు అప్పు తెచ్చాడు. అప్పునకు సంబంధించి రూ. 18 లక్షల వడ్డీని చెల్లించాడు. అప్పు తీరకపోగా ఇంటిని కుదువ పెట్టాలని సదరు వ్యక్తి వేధించాడని ఆ వీడియోలో ‘ఎంత కష్టపడిన అప్పు తీర్చలేకపోతన్న.. నాకు వేరే దారిలేదంటూ’ తన ఆవేదనతో చెబుతూ లింగరాజు క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న ధార్వాడ ఉపనగర పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

చదవండి : 5 కోట్లు గెలిచి 58 కోట్లు పోగొట్టుకున్న అభాగ్యుడు..

మరిన్ని వార్తలు