నిలోఫర్‌ చిన్నారి కిడ్నాప్‌ ఉదంతం సుఖాంతం.. పెంచుకుందామనే ఎత్తుకెళ్లారట!

20 Sep, 2023 12:52 IST|Sakshi

హైదరాబాద్‌: నగరంలోని నిలోఫర్‌ ఆసుపత్రిలో బాలుడి కిడ్నాప్‌ ఉదంతం సుఖాంతమైంది. తీవ్రంగా శ్రమించి ఈ కేసును టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఛేదించారు. నిజామాబాద్‌లో కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. బాలుడ్ని సురక్షితంగా తీసుకొచ్చారు.సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు  ప్రెస్ మీట్ ద్వారా ఈ వివరాలను వెల్లడించారు.

కామారెడ్డి జిల్లా బాన్సువాడకు చెందిన మమతకు మమతకు ఇదివరకే ఇద్దరు పిల్లలు పుట్టి చనిపోయారు. దీంతో ఓ బిడ్డను ఎత్తుకెళ్లైనా పెంచుకోవాలని మమత, ఆమె భర్త నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే.. తమ కుమారుడి ఆరోగ్యం బాలేదంటూ నిలోఫర్‌ ఆస్పత్రిలో చేరారు.  అక్కడ ఎవరైనా బిడ్డను  అదను చూసి ఎత్తుకెళ్లాలని పథకం వేశారు. 

ఆస్పత్రిలో చేరిన వాళ్లతో పరిచయం పెంచుకుంటూ.. ఫైసల్‌ఖాన్‌ అనే చిన్నారి మీద  కన్నేశారు. నాలుగు రోజుల కిందట.. ఫైసల్‌ తల్లి భోజనం తేవడానికి వెళ్లిన సమయంలో బిడ్డను తీసుకుని పరారయ్యారు. ఈ వ్యవహారంలో మరో ఇద్దరు ఈ జంటకు సహకరించారు. 

బిడ్డ కనిపించకపోయే సరికి తల్లి విషయాన్ని ఆస్పత్రి సిబ్బంది దృష్టికి తీసుకెళ్లింది. ఆపై పోలీసులను ఆశ్రయించారు. ఆస్పత్రిలో సీసీ కెమెరాలు పని చేయకపోవడంతో కిడ్నాపర్లను పట్టుకోవడం కష్టతరంగా మారింది పోలీసులకు. చివరకి.. ఆస్పత్రి సమీపంలోనే సీసీ ఫుటేజీల ద్వారా కేసు చేధించగలిగారు. జేబీఎస్‌ అక్కడి నుంచి నిజామాబాద్‌, కామారెడ్డి ఇలా సాగింది కిడ్నాపర్ల ప్రయాణం. చివరకు టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు ఈ జంటను పట్టుకుని.. బాలుడ్ని సురక్షితంగా తల్లిదండ్రుల దగ్గరికి చేర్చారు.

వింత వ్యాధి.. నవ్వాడనే ఉద్దేశంతోనే.. !
ఈ నెల 14తేదీన నిలోఫర్ లో కిడ్నాప్ గురైన ఆరు నెలల బాబు కిడ్నాప్ కేసును ఛేదించాం. చికిత్స కోసం ఫారీదా బేగం తన  కొడుకు ఫైసల్‌ఖాన్‌ను తీసుకొని వచ్చింది. భోజనం కోసం బయటకి తల్లి వెళ్ళింది. బాలుడు తల్లి భోజనం కోసం వెళ్లగా, వెంటనే బాలుడి ని కిడ్నాప్ చేశారు. శ్రీను , మమత అనే ఇద్దరు కిడ్నాప్ చేశారు. గత కాలంగా వీళ్లిద్దరికీ పిల్లలు పుట్టి చనిపోతున్నారు. 15 రోజులు క్రితం కూడా  దంపతులకు బాలుడు పుట్టారు. అనారోగ్యంతో నిలోఫర్లొనే చికిత్స పొందుతూ ఉన్నాడు. ఆ జంట.. అధిక రక్త స్నిగ్థత వ్యాధితో బాధపడుతోందని తెలుస్తోంది. దీని ప్రకారం.. మగ పిల్లలు పుడితే వెంటనే చనిపోతారు. కేవలం ఆడ పిల్ల పుడితేనే బతుకుతారు. ఇప్పటికే ఇద్దరు మగ పిల్లలు మృతి చెందారు, మూడో పిల్లోడు కూడా చనిపోతాడని భావించారు.

అందుకే నిలోఫర్‌లో ఓ పక్క కొడుకు చికిత్స తీసుకుంటుండగానే.. ప్లాన్‌ ప్రకారం ఫైసల్‌ను ఎత్తుకెళ్లారు. ఈ జంట బాన్సువాడ టౌన్‌లో కిరాయికి ఇల్లు తీసుకుని  ఆ ఎత్తుకొచ్చిన బిడ్డతో ఉన్నారు. నిలోఫర్ ఆస్పత్రి నుండి జూబ్లీ బస్ స్టాండ్ వరకు పోలీసులు 100 కెమెరాలు జల్లెడ పట్టి కేసును చేధించారు. ఆ బిడ్డ నన్ను చూసి నవ్వాడు. అందుకే పెంచుకుందామని ఎత్తుకెళ్లాం అని ఫైసల్‌ కిడ్నాప్‌గురించి మమత చెబుతోంది. బాలుడుకి రెండు రోజులు నిందితురాలు మమతనే పాలు ఇచ్చింది అని సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు వెల్లడించారు.

మరిన్ని వార్తలు