సహజీవనం: ట్రాన్స్‌జెండర్‌ అనుమానాస్పద మృతి 

19 May, 2021 06:59 IST|Sakshi

చైతన్యపురి: అనుమానాస్పదంగా ట్రాన్స్‌జెండర్‌ మృతి చెందిన ఘటన చైతన్యపురి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ రవికుమార్‌ వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా నేరేడుగొమ్మ బుద్దతండాకు చెందిన వంకునావత్‌ మహేష్‌(23) మూడు సంవత్సరాల క్రితం నగరానికి వచ్చి నివాసం ఉంటున్నాడు. అనంతరం లింగమార్పిడి చికిత్స చేయించుకుని మహేష్‌ తన పేరును అమృతగా మార్చుకున్నాడు. రెండేళ్లుగా చైతన్యపురి మోహన్‌నగర్‌లో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. ఎన్‌టీఆర్‌నగర్‌కు చెందిన షేక్‌ జావేద్‌తో సహజీవనం చేస్తున్నాడు.

ఇటీవల తనను జావేద్‌ హింసిస్తున్నాడని, చేయిచేసుకుంటున్నాడని బడంగ్‌పేటలో నివసించే సోదరుడు శ్రీనుకు ఫోన్‌లో చెప్పింది అమృత. మంగళవారం సాయంత్రం ట్రాన్స్‌జెండర్‌ కమ్యూనిటీకి చెందిన కిషన్‌ అనే వ్యక్తి శ్రీనుకు ఫోన్‌ చేసి అమృత చనిపోయిందని చెప్పారు. వెంటనే అమృత ఉండే గదికి వచ్చి చూడగా మంచంపై చనిపోయి కనిపించింది. శ్రీను ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించినట్లు ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు.
చదవండి: పెళ్లిచేసుకుని మోసం చేస్తున్నాడు: లేడీ కానిస్టేబుల్‌ ఫిర్యాదు

మరిన్ని వార్తలు