పెళ్లై సంవత్సరం కూడా కాలేదు.. భార్యపై అనుమానం.. గర్భిణి అని కూడా చూడకుండా..

22 Nov, 2022 07:12 IST|Sakshi
రేష్మా, మోహన్‌కుమార్‌ల పెళ్లి నాటి ఫొటో(ఫైల్‌) 

సాక్షి, బళ్లారి: పెళ్లై సంవత్సరం కూడా పూర్తి కాలేదు. కట్టుకున్న భార్య శీలంపై అనుమానం పెంచుకున్న ఓ భర్త భార్య ఆరు నెలల గర్భిణి అని కూడా చూడకుండా ఆమెను దారుణంగా హత్య చేసిన ఘటన పోలీసు విచారణలో ఆలస్యంగా వెలుగు చూసింది.

దావణగెరె జిల్లా చెన్నగిరి తాలూకా గంగొండనహళ్లికి చెందిన మోహన్‌ కుమార్‌(24) అనే వ్యక్తి తన భార్య రేష్మా(20)ను దారుణంగా హత్య చేసి, శవాన్ని ఆడవిలో పారవేసి పరారయ్యాడు. ఈ ఘటనపై రేష్మ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదనపు కట్నం కావాలని డిమాండ్‌ చేసేవాడని, తన కూతురిని హత్య చేసినట్లు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసి మోహన్‌ కుమార్‌ను పట్టుకుని విచారణ చేయగా నేరాన్ని ఒప్పుకున్నాడు.

భార్యను దారణంగా హత్య చేసి, బంధువులకు, గ్రామస్తులకు అనుమానం రాకుండా చిక్కమగుళూరు జిల్లా అజ్జంపుర పోలీసు స్టేషన్‌ పరిధిలోని ఆడవిలో పాతిపెట్టి భార్య కనిపించడం లేదని నమ్మించేందుకు ప్రయత్నించిన మోహన్‌ కుమార్‌ చివరకు కటకటాల పాలయ్యాడు.  

చదవండి: (ప్రియుడితో కుమార్తె పరార్‌.. తల్లిదండ్రుల ఆత్మహత్య)

మరిన్ని వార్తలు